Healthhealth tips in telugu

పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడుతున్నారా? వాటికి బదులు ఈ ఆకు వాడితే కీళ్ల నొప్పులు మాయం!

Joint pains Home remedies In Telugu :తరచుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడుతున్నారా? అయితే వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కు చెక్ పెడుతూ, సహజ సిద్ధంగా నొప్పులను తగ్గించి మజిల్స్ ను రిలాక్స్ చేసే అద్భుతమైన ఔషధం ‘వావిలాకు’ (Vavili Aaku). ఈ ఆకుతో నొప్పులను ఎలా తగ్గించుకోవచ్చో, దీన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

మన చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. ఆ మొక్కల గురించి మనలో చాలా మందికి తెలియక పిచ్చి మొక్కలుగా భావిస్తూ వుంటాం. అయితే ఆ మొక్కలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి మొక్కలలో వావిలాకు ఒకటి.

ఈ వావిలాకు గురించి మన పెద్ద వారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయని మన పెద్దవారు వావిలాకు ను ఉపయోగించేవారు.

వావిలాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళవాపు, కీళ్ల నొప్పులు తగ్గటానికి ఈ వావిలి ఆకులు చాలా బాగా సహాయపడుతాయి దీనికోసం ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని కాస్త వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పులు అలాగే వాపు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

వావిలాకు పొడి మార్కెట్లో లభ్యం అవుతుంది. ఆయుర్వేద షాపుల్లో అలాగే ఆన్లైన్ స్టోర్ లో కూడా .దొరుకుతుంది. అర స్పూన్ పొడిని 2 కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించి వడగట్టి తాగితే దగ్గు,గొంతు చికాకు,జ్వరం వంటివి తగ్గిపోతాయి. నువ్వుల నూనె వావిలాకు రసం కలిపి పొయ్యి మీద పెట్టి .నీరు అంతా ఇగిరిపోయేదాకా మరిగించాలి.

ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పులు మరియు అన్నీ రకాల నొప్పులు నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వావిలాకును ఉపయోగించి ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."