Beauty TipsHealthhealth tips in telugu

రోజూ వాడే నూనెలో ఇది కలిపి రాస్తే.. జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది!

Hair Care Tips:జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా మరియు పొడవుగా పెరగాలంటే ఏం చేయాలి? రోజూ వాడే నూనెలో ఈ సహజ పదార్థాన్ని కలిపి రాసే సులభమైన చిట్కా ఇక్కడ తెలుసుకోండి.

ఈ నూనెలో ఇది కలిపి రాస్తే ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది… ఈ మధ్యకాలంలో చాలా మందిని వేదిస్తున్న సమస్యలలో జుట్టు రాలే సమస్య ఒకటి. జుట్టు రాలటం ప్రారంభం కాగానే చాలా మంది కంగారుపడి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. కాస్త శ్రద్దగా చేస్తే మంచి ఫలితం వస్తుంది.
kalabanda benefits in telugu
ఈ రెమిడీ కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ వాడుతున్నాం. ఒక బౌల్ లో 2 స్పూన్ల కలబంద జెల్, 2 స్పూన్ల బాదం నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. కలబంద జెల్, బాదం నూనెలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా చేస్తాయి.
hair fall tips in telugu
జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ చిట్కా ఫాలో అయితే చక్కని ఫలితం వస్తుంది. ఏదో ఒక వారం ఈ రెమిడీ ఫాలో అయ్యి సమస్య తగ్గలేదు అంటే కుదరదు. కనీసం 4 వారాల పాటు చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. తెల్లజుట్టు కూడా నల్లగా మారుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."