Beauty TipsHealthhealth tips in telugu

పసుపులో ఇది కలిపి రాస్తే చాలు.. ముఖంపై నల్లని మచ్చలు తగ్గుతాయి!

Turmeric And Milk Face Glow Tips in telugu:ముఖంపై నల్లని మచ్చలు, ట్యాన్ తగ్గి చర్మం కాంతివంతంగా మారాలంటే ఏం చేయాలి? పసుపులో ఈ సహజ పదార్థాలను కలిపి వాడే సులభమైన చిట్కా ఇక్కడ తెలుసుకోండి.

ముఖం మీద ఎటువంటి మచ్చలు,మొటిమలు లేకుండా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

పసుపును పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీ బాక్టీరియల్,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, కర్కుమిన్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన చర్మానికి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

నిస్తేజంగా మారిన చర్మానికి మెరుపును అందిస్తుంది. అలాగే పసుపు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా మరియు తాజాగా ఉంచడంలో సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ పసుపు,సరిపడా పాలను వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి మెడకు రాసి 5 నిమిషాల తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. శనగపిండిని కూడా పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు. శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద మృత కణాలను తొలగించి ముఖం మెరిసేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద ఇచ్చిన లింక్ copy చేసి చూడండి.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."