“అరచేతులు, అరికాళ్లల్లో మంటలు, తిమ్మిర్లా? ఈ ఒక్క చిట్కాతో క్షణాల్లో ఉపశమనం!”
అరచేతులు, అరి కాళ్ళలో తిమ్మిర్లు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి. తిమ్మిర్లు వచ్చినప్పుడు సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే తిమ్మిరి వచ్చిన భాగం స్వాధీనంలో లేకపోవడం, ఝుమ్మని లాగటం వంటివి ఉంటాయి. ఎక్కువసేపు కదలకుండా అలా కూర్చున్నప్పుడు కూడా తిమ్మిర్లు వస్తాయి.
ఈ విధంగా తిమ్మిర్లు వచ్చినప్పుడు లేచి నాలుగు అడుగులు వేసి నడిస్తే తిమ్మిర్లు తగ్గుతాయి. అలా కాకుండా ఎక్కువ రోజులు తిమ్మిర్లు ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.

ఎందుకంటే ఇది నరాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ తిమ్మిర్లు అనేవి సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారిలోనూ నరాలు ఒత్తిడికి గురైనప్పుడు, నరాల్లో రక్తప్రసరణ సరిగ్గా జరగనప్పుడు వస్తాయి.
ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే ఇంటి చిట్కాలు కూడా పనిచేస్తాయి. అయితే డాక్టర్ సూచనలను పాటిస్తూ మాత్రమే ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి. సొరకాయను సర్కిల్ గా కట్ చేసి గాటులు పెట్టి తిమ్మిర్లు ఉన్న ప్రదేశంలో రుద్దాలి. ఈ విధంగా రాత్రి పడుకునే ముందు చేస్తే నిద్ర బాగా పడుతుంది.

ధనియాలు, సోంపు, పటిక బెల్లం ఈ మూడింటిని సమానం మొత్తంలో తీసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని నిలవ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం అర స్పూన్ మోతాదులో ఈ పొడిని తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
దాదాపుగా నెల రోజులపాటు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ తిమ్మిర్లు సమస్య ఉన్నప్పుడు డాక్టర్ని మాత్రం తప్పనిసరిగా సందర్శించాలి.
ఇవి కూడా చదవండి:
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

