Healthhealth tips in telugu

ఈ ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే చాలు.. అసిడిటీ, గ్యాస్ సమస్య టాబ్లెట్ కన్నా ఫాస్ట్ గా మాయం!

ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, మసాలాలు ఎక్కువగా తినడం, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యలలో గ్యాస్ సమస్య కూడా ఒకటి.

గ్యాస్ సమస్య రాగానే మనలో చాలామంది మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వలన తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది.

అలా కాకుండా మన వంటింట్లో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. మన వంటింట్లో టాబ్లెట్ కన్నా ఫాస్ట్ గా తగ్గించే హోమ్ రెమిడి ఉంది.

మసాలా మజ్జిగ
ఒక గ్లాసు పలచని మజ్జిగలో పావు స్పూను వేగించిన జీలకర్ర పొడి, కొద్దిగా పుదీనా రసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగాలి.

చల్లని మజ్జిగ పొట్టలోని యాసిడ్ను శాంతపరుస్తుంది. అలాగే పుదీనా, జీలకర్ర జీర్ణ ప్రక్రియను వేగవంతం చేసి కడుపులో పేరుకుపోయిన గ్యాస్ను బయటకి పంపిస్తుంది. దాదాపుగా మసాలా మజ్జిగ తాగిన ఐదు నుంచి పది నిమిషాల్లోపే పొట్ట ఫ్రీ అవుతుంది.

సోంపు వాము వాటర్
ఒక గ్లాసు నీటిలో సోంపు, వాము వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

వాము, సోంపు లో ఉన్న లక్షణాలు టాబ్లెట్ కన్నా వేగంగా గ్యాస్ కడుపుబ్బరం తగ్గించడానికి పనిచేస్తాయి.

అరటిపండు
అరటిపండు లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన పొట్ట గోడలపై యాసిడ్ పడకుండా రక్షణ పొరగా పనిచేస్తుంది. కాస్త గ్యాస్ అనిపించినప్పుడు ఒక అరటిపండు తింటే మంచి ఫలితం కనబడుతుంది.

చల్లని పాలు
గ్యాస్ కారణంగా గుండెల్లో మంట విపరీతంగా ఉన్నప్పుడు పంచదార లేకుండా ఒక చిన్న గ్లాసు చల్లని పాలు తాగితే దానిలో ఉండే క్యాల్షియం యాసిడ్ రిఫ్లెక్స్ ను నిరోధిస్తుంది.

గ్యాస్ ఉన్నప్పుడు టీ లేదా కాఫీ అస్సలు తాగకూడదు అవి సమస్యను ఎక్కువ చేస్తాయి.

రాత్రి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల సమయం ఉండాలి.

గ్యాస్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ వంటివి తాగితే గ్యాస్ సమస్య చాలా ఎక్కువ అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."