Politics

షాకింగ్ న్యూస్ జనసేనలోకి బిగ్ బాస్ విన్నర్…షాకైన కౌశల్ ఆర్మీ…నిజం ఎంత?

స్టార్ మాలో బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకున్న కౌశల్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. బిగ్ బాస్ సీజన్ టు హౌస్ లో కంటెస్టెంట్స్ తనను టార్గెట్ చేసినా ఏమాత్రం పట్టు సడలకుండా అనుకున్న లక్ష్యం మేరకు నడుచుకుని ముందడుగు వేసి, విన్నర్ గా నిల్చిన కౌశల్ సినీ యాక్టర్స్ ని మించిన స్టార్ అయ్యాడు. 18మంది కంటెస్టెంట్స్ పాల్గొంటే,అందరినీ ఎదుర్కొంటూ సాగించిన పోరాటానికి బయట కోట్లాదిమంది అభిమానులు ఏర్పడ్డారు. కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో అభిమానులు దూసుకుపోయారు. ఇక సెలబ్రిటీలు సైతం కౌశల్ పోరాట పటిమను మెచ్చుకుంటున్నారు.

సినిమాల్లో కూడా మంచి ఛాన్స్ లు కల్పించడానికి కొందరు అప్పుడే ప్లాన్ కూడా వేస్తున్నారట. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన గూటికి వస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తన విజయాన్ని అభిమానులకే అంకింతం ఇచ్చిన కౌశల్,తనకు వచ్చిన ప్రైజ్ మనీని కూడా కాన్సర్ పేషంట్స్ కి సాయంగా ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా , కౌశల్ ఆర్మీకి చెప్పే తీసుకుంటానని అన్నాడు. రీసెంట్ గా ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్నే మరోసారి స్పష్టం చేసాడు.

దీంతో ,కౌశల్ ఆర్మీ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తంచేస్తున్నారు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందంగా ఉందని పొంగిపోతున్నారు. ఛానల్ ఇంటర్యూ సందర్బంగా యాంకర్ సడన్ గా పవన్ కళ్యాణ్ గృరించి,జనసేన పార్టీ గురించి అడిగేసరికి పవన్ పట్ల తనకున్న ప్రేమను కౌశల్ బయట పెట్టాడు. ‘నాకు పవన్ అంటే ఎంతో అభిమానం. ఆయన బాడీ లాంగ్వేజ్,ఇక ఏదైనా విషయాన్ని చెప్పే తీరు చాలా ఇష్టం.

షూటింగ్ సమయంలో ఇతర ఆర్టిస్టులను రిసీవ్ చేసుకోవడం,వారి పట్ల వ్యవహరించే తీరు, తనంత తానుగా ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచించుకోవడం ఇలా అన్ని విషయాలు ఎంతో ఆకట్టుకుంటాయి. ఇతర నటుల పట్ల యాక్టివ్ గా ఉంటూ,ఎవరైనా తప్పుగా చేస్తే, సరిదిద్దడంలో పవన్ చూపే చొరవ అద్వితీయం. అనవసరంగా ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనరు. అందరి పట్లా ఎంతోమర్యాదగా ఉంటారు’అని కౌశల్ వివరించాడు.

ఇక జనసేన పార్టీ పీక్స్ లో ఉండడం,పవన్ తో మీకు పరిచయం ఉండడం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని మీరు జనసేనలో చేరతారా అని అడగ్గా,’జనసేనలో చేరడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కౌశల్ ఆర్మీ ఏది చెబితే అదే చేస్తున్నాను. ఒకవేళ కౌశల్ ఆర్మీ చెబితే వెంటనే జనసేనలో చేరతా. టైం వచ్చినపుడు అన్ని వివరాలు వెల్లడిస్తా’అని కౌశల్ చెప్పుకొచ్చాడు.