Kitchen

రెస్టారెంట్ స్టైల్ లో చనా మసాలా గ్రేవీ … సింపుల్ గా చేసేయండి

కావలసిన పదార్ధాలు
శనగలు 1 కప్పు, టమోటో పేస్ట్ – 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ – 1 కప్పు, చోలే మసాలా – 1 స్పూన్, కారం – 1 స్పూన్ ,ఉప్పు – 1 స్పూన్ ,అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్, ఆయిల్ – సరిపడా ,

తయారీ విధానం
శనగలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఉడికించాలి. ఉడికిన శనగలలో సగం మెత్తని పేస్ట్ గా చేయాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోల్డ్ కలర్ వచ్చాక ఉల్లి పేస్ట్ వేయాలి. ఉల్లి పేస్ట్ గోల్డ్ కలర్ వచ్చాక టమోటా పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత కారం,ఉప్పు, చోలే మసాలా వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిసాక శనగల పేస్ట్ వేసి బాగా కలపాలి. కొంచెం నీటిని వేసి బాగా కలపాలి. చివరగా శనగలను వేసి పది నిముషాలు ఉడికిస్తే చనా మసాలా గ్రేవీ రెడీ. ఈ గ్రేవీ చపాతీ,పూరి,పరాఠా వంటి వాటికీ చాలా బాగుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."