Movies

శ్రియ సరన్ పెళ్లి అయ్యాక ఎక్కడ ఎలా ఉందో చేస్తుందో తెలుసా? నమ్మలేని నిజాలు

ఇష్టం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో నటించి తన సత్తా చాటింది. నువ్వే నువ్వే, సంతోషం,ఠాగూర్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. 2008లో ది అదర్ ఎండ్ ఆఫ్ లైన్ అనే ఆంగ్ల మూవీలో నటించి సత్తా చాటింది.2018లో గాయత్రి,వీర భోగ వసంత రాయలు మూవీస్ లో నటించినా పేరు రాలేదు. అగ్రహీరోల అందరి సరసన చేసిన శ్రేయ సినీ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు దాటింది. అయినా తన గ్లామర్ తో రఫ్ ఆడిస్తోంది. 1982 సెప్టెంబరు 11 ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో పుష్పేంద్ర, నీరజ దంపతులకు జన్మించింది. ఈమె పూర్తిపేరు శ్రియ సరన్. తండ్రి బీహెచ్ ఈ ఎల్ లో పనిచేయగా, తల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో కెమిస్ట్రీ టీచర్ గా చేసారు.

శ్రియకు అభిరూప్ అనే సోదరుడున్నాడు. హరిద్వార్ లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న శ్రియ ఆతర్వాత ఢిల్లీలో శ్రీరామ్ మహిళా కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి,హరిద్వార్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది. చిన్నపుడు కథక్ నృత్యం నేర్చుకున్న శ్రియ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొనేది. సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా డాన్స్ లు చేసేది. ఇక పుస్తక పఠనం ఎక్కువగా ఉండడం వలన రచనలు, కవితలు చేసేది. డిగ్రీ చేసే రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే శ్రియ రామోజీ ఫిలిం సిటీలో డాన్స్ చేసింది. అప్పుడే ఇష్టం సినిమాలో ఛాన్స్ వచ్చింది.

మొదట్లో సినిమాల్లో చేయడం ఇష్టం లేని శ్రియను పేరెంట్స్ ఎంకరేజ్ చేయడంతో నటించింది. ఆవిధంగా 2001లో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయిన ఈమె కు ఈ సినిమా చేదు అనుభవం మిగిల్చినా,ఈమె తెలుగు అమ్మాయిలా ఉండడంతో తరుణ్ తో నువ్వే నువ్వే,నాగ్ తో సంతోషం మూవీస్ లో ఛాన్స్ లు వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. సంతోషం మూవీలో ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకుంది. ఇక తెలుగులో వరుసపెట్టి ఛాన్స్ లు వచ్చిపడ్డాయి. తమిళ , కన్నడ,బాలీవుడ్ మూవీస్ లో నటించింది.

చెన్నకేశవరెడ్డి,ఠాగూర్,నీ మనసు నాకు తెలుసు, నీకు నేను నాకు నువ్వు,నేనున్నాను, ఎలా చెప్పను, ఛత్రపతి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో హిట్ అయిన వర్షం మూవీ తమిళంలో తీస్తే అందులో హీరోయిన్ గా వేసి హిట్ కొట్టింది. 2007లో రజనీ సరసన శివాజీ మూవీ లో చేసి సూపర్ హిట్ అందుకుంది. అయితే సదా మీ సేవలో, బాలు మూవీ డిజాస్టర్ అయ్యాయి. సోగ్గాడు ,మున్నా, దేవదాస్,బాస్ ,తులసి మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో అదరగొట్టేసింది.

మూడేళ్ళ విరామం తర్వాత తెలుగులో మళ్ళీ ఎంట్రీ ఇస్తూ డాన్ మూవీలో రవితేజ సరసన నటించి హిట్ అందుకుంది. 2013లో వేశ్య పాత్రలో పవిత్ర సినిమా చేసి తన నటనతో అందరిని అలరించింది. నాగ్ తో మనం,ఆతర్వాత గోపాల గోపాల మూవీలో నటించి హిట్ అందుకుంది. ఇక శ్రియ సమాజంలో మహిళా సమస్యలపై ఎప్పటికప్పుడు తన గళం వినిపించేది.

ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించే సేవ్ చైల్డ్ ఆర్ట్ అనే స్వచ్ఛంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ పేదలకు సాయం అందించడంలో ముందుంటోంది. అనాధ ఆశ్రమాల్లో పిల్లలను కల్సి చేయూతనిస్తుంది. వరల్డ్ విజన్ అనే సంస్థలో సభ్యురాలిగా ఉంది. 2013లో అనివార్య కారణాల వలన ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసిన శ్రియ 2015లో కొత్త ఖాతా ఓపెన్ చేసింది. తాను లవ్ చేసిన ఆండ్రీ అనే రష్యన్ వ్యక్తి 2018మార్చి 12న పెద్దల సమక్షంలో పెళ్లాడింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."