తమలపాకు ఎక్కువగా తినే అలవాటు ఉందా… ఈ 3 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

తమలపాకు రసానికి కొబ్బరినూనె కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు,కఫము వంటి శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ తమలపాకు రసంలో అరస్పూన్ తేనే కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో తమలపాకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నట్టు వెల్లడి అయింది. కాబట్టి మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా తమలపాకు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మలబద్దకం సమస్య ఎక్కువ అయింది.
ఈ సమస్య పరిష్కారానికి తమలపాకు చాలా బాగా సహాయాపడుతుంది. లేత తమలపాకులను వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశం మరియు దెబ్బలు తగిలినప్పుడు వాపు, రక్తం గడ్డ కట్టడం లాంటివి జరిగిన ప్రదేశంలో పెడితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

