గోరింటాకు సీరియల్ పార్థు రియల్ లైఫ్… అతని భార్య ఎవరో తెలుసా?
మాటీవీలో ప్రసారం అవుతున్న గోరింటాకు సీరియల్ ఆడియన్స్ ఆదరణతో దూసుకెళ్తోంది. ఇక ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న పార్ధు రియల్ లైఫ్ చూస్తే,అతడి అసలు పేరు నిఖిల్ మలైకళ్. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో పుట్టి పెరిగిన యితడు చదువు కూడా అక్కడే పూర్తిచేసాడు.
డాన్స్ అంటే ఎక్కువ ఇష్టపడే పార్ధు డాన్సర్ గా పనిచేసాడట. ఆతర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేయడంతో అతడి ఫిలిమ్స్ చూసి కన్నడ లోని కలర్స్ ఛానల్ ప్రసారమైన మనమే మంత్రాలయ సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ లో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆతర్వాత గోరింటాకు సీరియల్ లో ఛాన్స్ కొట్టేసిన నిఖిల్ పాత్ర పరంగా పార్థుగా మంచి నటన కనబరుస్తున్నాడని అందరూ అంటున్నారు. లాంగ్ ట్రిప్స్ అంటే ఇష్టపడే యితడు ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్తాడు. నిఖిల్ తండ్రి పేరు శశి. తల్లిపేరు సురేఖ. నిఖిల్ కి ఓ నిశాంత్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.

