Healthhealth tips in telugu

బొప్పాయి పండును ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Papaya Benefits in telugu : పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది.ఇది చాలా లాభదాయకమైన ఫలం.విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయిలో మంచి మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్, న్యూట్రింట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది.ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Benefits of papaya seeds
దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు.కాని ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు తెలుసా ? ఆ కొందరు ఎవరు ? ఎలాంటి కండీషన్స్ లో బొప్పాయి తినకూడదో చూడండి. ఆస్తమా, హై ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే.ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.
papaya Leaf Health Benefits In Telugu
ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది.సమస్యను ఇంకా పెంచుతుంది. అలాంటివారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలి.చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిదే. బీటా కెరోటిన్ ఉండటం వలన ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది కూడా.కాని అతిగా తింటేనే ప్రమాదం.
papaya Beauty benefits
ఇది తెల్ల, పసుపు మచ్చలకి కారణం అవుతుంది.ఇప్పటికే ఈ సమస్య ఉంటే అస్సలు బొప్పాయిని ముట్టుకోవద్దు.బొప్పాయిని లిమిట్ లో తీసుకుంటేనే మంచిది.

గర్భిని స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు.ఎందుకంటే దీంట్లో లటేక్స్ ఉంటుంది.ఈ ఎలిమెంట్ యుతెరైన్ కాంట్రాక్షన్ కి కారణం అవుతుంది. దీని వలన కడుపులో బిడ్డకి ప్రమాదం. ఒక్కోసారి అబార్షన్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి అతిగా తినవద్దు. ఎక్కువగా విటమిన్ సి ఉండటం వలన బొప్పాయి మంచిది. కాని ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.