తాజ్ మహల్ సినిమా గురించి నమ్మలేని నిజాలు…రిజెక్ట్ చేసిన హీరో…?
Taj Mahal Telugu Full Movie : డైరెక్టర్ ముప్పలనేని శివ ఓ కథను మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడికి చెప్పగానే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అయితే విక్టరీ వెంకటేష్ ని హీరోగా తీసుకుందామని అనుకుంటే, కథ విని కొత్త హీరో అయితే కుదురుతాడని వెంకీ రిజెక్ట్ చేసాడు. ఈ సినిమాతో అందరి కెరీర్ మలుపు తిరిగింది. అయితే హరీష్ ని తీసుకోవాలని రామానాయుడు సూచించగా, అప్పటికే కొండపల్లి రత్తయ్య మూవీలో నటిస్తున్నందున,హీరో శ్రీకాంత్ ని పెట్టి తీద్దాం అని చెప్పడంతో రామానాయుడు ఒకే చెప్పేసారు. బాలీవుడ్ విలన్ ని తీసుకుందామని నాయుడు గారు చెప్పినా, రియల్ స్టార్ శ్రీహరిని ముప్పలనేని శివ సెలక్ట్ చేసాడు.
హీరోయిన్ గా మోనికా బేడీని ఒకే చేద్దామనుకుంటే ఆమె ఒప్ప్పుకోలేదు. డైరెక్టర్ మొత్తం వివరించి చెప్పడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ గా రామానాయుడు సూచించిన ఎం ఎం శ్రీలేఖ పేరును ఒకే చేసారు. శ్రీకాంత్ కి,శ్రీహరికి, శ్రీలేఖకు లైఫ్ ఇచ్చే మూవీగా తీర్చిదిద్దాలని ముప్పలనేని శివ భావించాడు. ఇక ముప్పలనేని అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణతో ఘరానా అల్లుడు తీసి, సక్సెస్ రాకపోవడంతో తర్వాత సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తపన పెరిగింది.
మోనికాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్, అందుకు ఒప్పుకొని అన్నయ్యగా శ్రీహరి కుట్రలు, దీంతో శ్రీకాంత్ హైదరాబాద్ వచ్చేయడం, తర్వాత శ్రీకాంత్ ని వెతుక్కుంటూ మోనికా హైదరాబాద్ రావడం, శ్రీకాంత్ తండ్రికూడా వీరి ప్రేమను ఒప్పుకోకుండా సంఘవితో పెళ్లి చేయాలనుకోవడం, ఇలా ట్విస్ట్ మీద ట్విస్ట్ తో ప్రేమ,త్యాగాల సమాహారంగా మారుతుంది.
చివరకు తన చెల్లి కాదని తెల్సి ఆమె పెళ్లికోసం శ్రీహరి తన ప్రాణాలను ఇచ్చేస్తాడు. ఇది అద్భుతమైన మలుపు. 1995లో వచ్చిన ఈ మూవీ సెన్షేషనల్ హిట్ అయింది. ఈ సినిమాతోనే గేయరచయితగా చంద్రబోస్ ఎంట్రీ. శ్రీహరి నటనకు నంది అవార్డు. బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ హిట్ మూవీగా కాసుల పంట పండించింది. ఇక రాజా సినిమాతో వెంకీకి డైరెక్షన్ చేసే ఛాన్స్ కూడా ముప్పలనేని శివకు దక్కింది.

