Healthhealth tips in telugu

12 గంటలు నానబెట్టి తింటే డయబెటిస్,నరాల బలహీనత,నీరసం,అలసట అనేవి జీవితంలో ఉండవు

Rajma benefits in telugu : చిక్కుడు జాతికి చెందిన రాజ్మా కిడ్నీలను పోలి ఉండటం వలన కిడ్నీ బీన్స్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాజ్మాను ప్రోటీన్ మరియు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. మాంసాహారం తిన లేనివారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
Acidity home remedies
రాజ్మా లో రాగి, ఐరన్, పాస్పరస్, మాంగనీస్, విటమిన్ బి 1, పోలెట్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
Diabetes diet in telugu
అలాగే ఇసో ప్లేవొన్, .ఫ్లవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా అకస్మాత్తుగా వచ్చే రక్తపోటును మరియు గుండె కండరాల పనితీరు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రవాహం బాగా సాగేలా చేస్తుంది.

నరాల బలహీనత, అలసట, నీరసం అనేవి ఉండవు. రాజ్మాలో ఉండే కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క సమ్మేళనం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఆకలి కూడా తగ్గుతుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.
Joint Pains
వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలు గుళ్ల బారటం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రాజ్మాలో ఉండే పోలేట్ శరీరంలో అసమానతలను క్రమబద్ధీకరణ చేస్తుంది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటికి కాస్త దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు రాజ్మా అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు విరివిగానే లభ్యమవుతుంది.
Rajma
రాజ్మా ను మసాలా కర్రీ గా చేసుకోవచ్చు. ఉడికించి తినవచ్చు. అలాగే కూరలు చేసు కున్నప్పుడు వాటిలో వేసుకోవచ్చు. రాజ్మాను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు వండుకోవాలి. లేదా ఉదయం సమయంలో నానబెట్టి సాయంత్రం సమయంలో వండుకోవాలి. రాజ్మాను దాదాపుగా 10 నుంచి 12 గంటల వరకు నానబెట్టాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."