Healthhealth tips in telugu

బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక లడ్డు తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి బాన పొట్ట ప్లాట్ గా మారుతుంది

Weight Loss Laddu In telugu : మారిన జీవనశైలి అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడం వలన గుండె జబ్బులు., డయాబెటిస్ వంటి ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయి.
Weight Loss tips in telugu
అందువల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడే మార్గాల కోసం చాలామంది అన్వేషిస్తూ ఉంటారు. బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయి నిరాశ చెంది ఉన్న వారికి ఇప్పుడు చెప్పే లడ్డు చాలా బాగా సహాయపడుతుంది. పొయ్యి మీద పాన్ పెట్టి అందులో నాలుగు స్పూన్ల అవిసే సగింజలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.

అవిసె గింజలు చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి సన్నగా తురిమి రసం తీసుకోవాలి. ఒక బౌల్ లో అవిసె గింజల పొడి, అల్లం రసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకొని చిన్నచిన్న లడ్డూల మాదిరిగా చేసుకొని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి.
Ginger benefits in telugu
దాదాపుగా వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి ముందు ఒక లడ్డు తింటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

కాస్త ఓపికగా ఇలా లడ్డులను తయారుచేసుకొని తింటే శరీరంలో కొవ్వు కరగటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అవిసే గింజలలో ఉన్న పోషకాల కారణంగా ఈ మధ్య కాలంలో వీటి వాడకం కూడా చాలా ఎక్కువ అయింది. చాలా సులభంగా తయారుచేసుకొనే ఈ లడ్డును తిని ఈ ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.