Beauty TipsHealthhealth tips in telugu

కలబందను జుట్టుకు ఇలా రాస్తే చాలు.. ఊడిన చోటల్లా కొత్త జుట్టు ఒత్తుగా పెరుగుతుంది!

Aloe Vera Benefits: ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు, మరియు ఒత్తిడి వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామంది జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలని మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. కానీ, మన ఇంటి పెరట్లోనే సులభంగా దొరికే ‘కలబంద’ (Aloe Vera) జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు.

కలబందలో ఉండే విటమిన్లు, ఎంజైమ్‌లు కుదుళ్లకు లోతుగా పోషణను అందించి, చుండ్రును తగ్గించి, జుట్టు రాలడాన్ని పూర్తిగా అరికడతాయి. ముఖ్యంగా కలబందను సరైన పద్ధతిలో జుట్టుకు అప్లై చేస్తే.. కుదుళ్లు బలపడి మీ జుట్టు వద్దన్నా సరే రెట్టింపు వేగంతో నల్లగా, ఒత్తుగా పెరుగుతూనే ఉంటుంది.

మరి జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలి? అందులో ఏం కలిపి రాస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం!

కలబందతో ఇలా చేశారంటే.. మీ జుట్టు వద్దన్నా.. పెరుగుతూనే ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో రకాల నూనెలను ఉపయోగించిన పెద్దగా ఫలితం లేక చాలా నిరుత్సాహనికి గురి అవుతూ ఉంటారు.

అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా పనిచేస్తుంది. కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసినప్పుడు నీటిని పోయకుండా అవసరం అయితే కొబ్బరి నూనె పోయాలి. కలబంద పేస్ట్ ఒక కప్పు వచ్చేలా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో కలబంద గుజ్జు వేసి దానిలో పావుకేజీ కొబ్బరి నూనె పోయాలి.

ఆ తర్వాత గుప్పెడు మందార ఆకులు, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. మందార ఆకులు,కలబంద మిశ్రమం బాగా వేగి నూనె బయటకు వచ్చేవరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజు కొబ్బరి నూనె ఎలా రాసుకుంటామో అలాగే రాసుకోవచ్చు.

అలా కాకుండా రాత్రి సమయంలో రాసుకొని తలకు cap పెట్టుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం అవసరం అయితే తలస్నానం చేయవచ్చు. ఈ విధంగా 15 రోజులపాటు ఈ నూనెను రాస్తే మంచి ఫలితం వస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."