1 గ్లాసు ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది
capsicum Weight Loss Tips in Telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, వ్యాయామం చేయకపోవటం,జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి ఇంటి చిట్కాలు సహాయపడతాయి.

మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాలసిన అవసరం లేదు. ఇంటిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ రోజు అధిక బరువు సమస్య తగ్గించుకోవటానికి ఒక మంచి డ్రింక్ తెలుసుకుందాం.

ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక పది రోజులు తాగితే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఈ డ్రింక్ కోసం Capsicum ఉపయోగిస్తున్నాం. capsicum బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి చిన్న Capsicum లో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

అంగుళం అల్లం ముక్కను తురిమి వేయాలి. 5 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ విధంగా 10 రోజులు తాగితే ప్రయోజనం కనపడుతుంది. డయబెటిస్ ఉన్నవారు తేనె వాడకూడదు. Capsicum లో బీటా కెరోటిన్, విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన, కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Capsicum తినడం వలన కొలెస్ట్రాల్ పెరగదు. అలాగే జీర్ణప్రక్రియలో బాగా సహాయ. పడుతుంది. జీవక్రియ బాగా సాగితే శరీరంలో కొవ్వు నిల్వ ఉండదు. కొవ్వు కరిగించటానికి బాగా సహాయపడుతుంది. శరీరం నుండి విషాలను బయటకు పంపుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అల్లం ఆకలి తొందరగా వేయకుండా సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

