Diabetes Care : షుగర్ వ్యాధి ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. పాటిస్తున్నారా…?
Diabetes Care:బిజీ జీవనశైలి. మారిన ఆహారపు అలవాట్లు కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా మధుమేహం వ్యాధి అందరికి వచ్చేస్తుంది. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ వ్యాధి బారి నుండి సురక్షితంగా ఉండవచ్చు. మధుమేహం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధి పాదాలు,కిడ్నీలు, గుండె, నరాల మీద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రతి రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధి ఉన్నవారు చెప్పులు లేకుండా బయటకు వెళ్ళకూడదు. ప్రతి రోజు పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. గోర్లు తీసే సమయంలో చిగురుకు గాయం కాకుండా చూసుకోవాలి.
మధుమేహ తీవ్రత ఎక్కువగా ఉన్నవారు రక్తపోటు,కొలెస్ట్రాల్,కంటి పరీక్షలు రెగ్యులర్ గా చేయించుకోవాలి. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకుకూరలను తీసుకోవాలి. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
సరైన సమయానికి ఆహారం,మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహ రోగులలో గుండె రక్తనాళాలు మూసుకుపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ మాత్రం గుండె నొప్పి అనిపించినా అన్ని పరీక్షలు చేయించుకోవటం మంచిది. తెల్ల బియ్యం కన్నా బ్రౌన్‌రైస్ తినటం మంచిది.
ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి.. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి.ఐస్ క్రీమ్స్, స్వీట్స్, కేక్స్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఒకవేళ తినాలని అనిపిస్తే dark చాక్లెట్ తింటే మంచిది. ప్రతి రోజు వ్యాయామం చేయాలి.
ఇది కూడా చదవండి: Oily Skin Tips: ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటుందా…ఈ టిప్స్ ఫాలో అయితే సరి
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

