Karnataka Style Chitrannam:చిటికెలో తయారయ్యే వైట్ చిత్రాన్నం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Karnataka Style Chitrannam Recipe: రాయలసీమ చిత్రాన్నం గురించి అందరికి తెల్సిందే. కాని కొబ్బరి,సోయా ఆకులతో చేసే కర్ణాటక స్టైల్ వైట్ చిత్రాన్నం ఎప్పుడైన ట్రై చేసారా.లేదంటే ఇప్పుడు ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
అన్నం – 1 కప్పు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
పచ్చి శెనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
మిరియాలు – ½ టీ స్పూన్
పచ్చిమిర్చి చీలికలు – 3
ఎండుమిర్చి – 2
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
ఉప్పు – తగినంత
జీడిపప్పు – 12-15
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్
పచ్చి కొబ్బరి తురుము – 1 కప్పు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
సోయకూర ఆకు – 1/3 కప్పు
తయారి విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడి చేసి అందులో జీడిపప్పులు,పల్లీలు వేసి ఎర్రగా వేపి పక్కన పెట్టుకోవాలి.
2.అదే నూనెలో ఆవాలు,జీలకర్ర శనగపప్పు,మినపప్పు,మిరియాలు,ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ పై తాలింపు ఎర్రగా వేగనివ్వాలి.
3.అందులోకి పచ్చిమిర్చి,ఉల్లిపాయలు,ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేపుకోవాలి.
4.వేగిన ఉల్లిపాయల్లోకి సోయా కూర వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేపుకోవాలి.
5.వేగిన సోయ ఆకులో పసరు వాసన పోయాక..ఉడికించిన అన్నం ,పచ్చికొబ్బరి తురుము వేసి మంట హై ఫ్లేమ్ లోకి మార్చుకోని బాగా టాస్ చేసుకోవాలి.
6.చివరగా వేపి పక్కన పెట్టుకున్న జీడిపప్పు,పల్లీలు,నిమ్మరసం కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వైట్ చిత్రాన్నం తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News

