Kitchenvantalu

Usirikaya Annam:ఉసిరికాయ‌ అన్నం ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు.. క‌మ్మ‌ని రుచి.. ఆరోగ్య‌క‌రం..!

Usirikaya Annam: ఆరోగ్యానికి, ఎంతోమంచిది ఉసిరికాయ. అన్ని సీజన్స్ లో దొరకని, ఉసిరికాయతో, అన్నం చేసి చూడండి. ఈ అన్నం ఒకసారి తింటే అసలు వదిలిపెట్టకుండా తింటారు.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1కప్పు
నీళ్లు -2 కప్పులు
పసుపు – 1/2టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్
మిరియాలు – 1/2టేబుల్ స్పూన్
నూనె – 2.5 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
కరివేపాకు – 2 రెబ్బలు
అల్లం తురుము – 1/2టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 2
పచ్చిమర్చి -2
సాంబార్ పొడి – 1 టేబుల్ స్పూన్
ఉసిరి కాయలు – 5

తయారీ విధానం
1.బియ్యంలో నీళ్లు పోసి, ఉప్పు, పసుపు వేసి, కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్ పై, మూడు విజిల్స్ రానివ్వాలి.
2.స్టీమ్ పొయిన తర్వాత, మూత తీసి, అన్నం, చల్లారనివ్వాలి.
3.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నువ్వులు,మిరియాలు, వేపుకుని, కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
4.ఉసిరికాయలను, తురిమి పక్కన పెట్టుకోవాలి.

5.స్టవ్ పై కడాయి పెట్టుకుని, నూనె వేడి చేసి,అందులో, ఆవాలు , మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసి, మీడియం ఫ్లేమ్ పై వేపుకోవాలి.
6. వేగిన తాళింపులో, మిగిలిన పదార్ధాలు అన్ని వేసి, ఎర్రగా వేపుకోవాలి.
7.చివరగా సాంబార్ పొడి వేసి, స్టవ్ ఆఫ్ చేసుకుని, ఉసిరికాయ తురుము వేసి, కలుపుకోవాలి.
8. ఆ తర్వాత ఆ తాళింపులోను, చల్లారిన అన్నంలో వేసి, కలుపుకుని, అరగంట పాటు పక్కన పెట్టాలి.
9.అంతే ఉసిరికాయ అన్నం తయార్.
Click Here To Follow Chaipakodi On Google News