Kitchenvantalu

15 రోజులు నిల్వ ఉండే కమ్మని బీరకాయ కారం పొడి.. ఇలా చేసి చూడండి!

Beerakaya Karam Podi Recipe:15 రోజులు నిల్వ ఉండే కమ్మని బీరకాయ కారం పొడి.. ఇలా చేసి చూడండి.. తెలుగు వారి భోజనం అంటే పచ్చల్లు,కూరలు,పొడులు తప్పకుండ ఉండవల్సిందే.

మొదటి వేడి వేడి అన్నం లో ఒక ముద్ద కారం పొడి లేదా ,చట్నీ లో నెయ్యి కలుపుకోని తింటే ఆ టేస్టే వేరు.బీరకాయ తొక్క తో కారం ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి

కావాల్సిన పదార్ధాలు
బీరకాయ పొట్టు – ½ kg బీరకాయ తొక్కు
వాము – 1 టీస్పూన్
ఎండు మిర్చి – 10-15
మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 7-8
చింతపండు – 8 గ్రాములు
Beerakaya benefits
తయారీ విధానం

1.ముందుగా బీరకాయ తొక్కను నీళ్లు యాడ్ చేయకుండ బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
2.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని ఆయిల్ వేసి అందులోకి ఎండుమిర్చి వేసి వేపుకోని పక్కనపెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లో మినపప్పు వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
4.అదే ప్యాన్ మరో టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోని బరకగా గ్రైండ్ చేసుకున్న బీరకాయ పొట్టును పొడిగా తయారయ్యే వరకు వేపుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి పసుపు,వాము,వేసి కలుపుకోవాలి.

☛ Also Read: Face Glow Tips: బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా… ఇంట్లోనే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!

6.ఇప్పుడు మిక్సి జార్ లోకి వేపుకున్న మినపప్పు, ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు,చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు అందులోకి వేపుకున్న బీరకాయ పొట్టును వేసి గ్రైండ్ చేసుకోవాలి.
8.ఇప్పుడు బీరకాయ కారంలోకి ఉప్పు,కారం అడ్జెస్ట్ చేసుకోని స్టోర్ చేసి పెట్టుకోవడమే.

☛ Also Read: తెల్ల జుట్టుతో విసిగిపోయారా? 4 కుంకుడు కాయలతో ఈ అద్భుతమైన చిట్కా ట్రై చేయండి!

☛ Also Read: జుట్టు రాలిపోతోందా? 3 రోజుల్లో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే అద్భుతమైన చిట్కా!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."