Kitchenvantalu

Chikkudukaya Tomato Curry:చిక్కుడుకాయ టమాటో కూర ఇలా చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది

Chikkudukaya Tomato Curry: చిక్కుడు కాయను ఉడకపెట్టి టమాటో మిక్స్ చేసి గ్రేవి కర్రీ చేసి,కాసింత నువ్వుల పొడివేసి చేసారంటే రుచి అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
చిక్కుడు కాయలు – ¼ kg
టమాటోలు -3
ఉల్లిపాయలు – 1
పచ్చిమిర్చి – 2
జీలకర్ర – 1 టీ స్పూన్
కారం – 1 ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ధనియాలపొడి – 1 టీ స్పూన్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్

తయారీ విధానం
1.చిక్కుడు కాయలను నారతీసి కట్ చేసుకోని గిన్నెలో కప్పు నీళ్లను వేసి ఉడకపెట్టి వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
2.ప్యాన్ ఆయిల్ వేడి చేసి అందులోకి జీలకర్ర,తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి.
3.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోని ఉడకపెట్టిన చిక్కుడు కూడ యాడ్ చేసుకోని మూతపెట్టి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి.
4.చిక్కుడు కాయ మగ్గుతున్నప్పుడు టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు ఉడికించాలి.
5.టమాటాలు మగ్గాక కారం,ఉప్పు,ధనియాల పొడి,నువ్వుల పొడి వేసి గ్రేవి కోసం నీళ్లు వేసి కలుపుకోని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
6.చివరగా కొత్తిమీర తరుగు చల్లుకోని స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."