Movies

ఆ డైరెక్టర్ కష్టాల్లో ఉన్న సరే ప్రతి నెల డబ్బు పంపుతున్నాడు

పాతకాలం హాస్య నటీనటులతో రమాప్రభ ఒకరు. రమాప్రభ ఆ నాటి నటులతోను,ఈ తరం నటులతోను కలిసి నటించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె మిడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గురించి ఎన్నో విషయాలను చర్చించారు. జయలలిత చాలా సౌమ్యంగా ఉండేవారని, తన వారిని ఓ కంట కనిపెడుతూ ఉండేవారని….స్నేహితులు,బంధువులు గురించి అరా తీసేవారట. జయలలితకు తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, ఆమె ఎన్ని సార్లు రమ్మని పిలిచినా వెళ్లలేదని చెప్పారు రమాప్రభ.

చాలా మంది పీక్ స్టేజ్ కి వెళ్ళాక పట్టించుకోరని అలాంటిది ఆమె ముఖ్యమంత్రి అయినా సరే తన గురించి పట్టించుకున్నారని చెప్పింది. రమాప్రభ ప్రస్తుతం చిత్తూర్ జిల్లా మదనపల్లెలో ఉంటున్నారు. సంపాదించిన ఆస్థి ఏ మాత్రం మిగలలేదు.

కొంత మంది చెప్పి దానాలు చేస్తూ ఉంటారు. కొంత మంది గుప్త దానాలు చేస్తూ ఉంటారు. పూరీ జగన్నాథ్ నాకు సాయం చేస్తున్నాడు. నాకు నెలకు ఇంత అని డబ్బు పంపిస్తున్నాడు. పూరితో నేను ఎక్కువగా సినిమాలు చేయకపోయినా ఏ నాటి బంధమో పూరి నాకు సాయం చేస్తున్నాడు. ప్రసుతం రమాప్రభ సినీ మాయ ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."