Kitchenvantalu

Kitchen Tips:పసుపు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టిప్స్

Turmeric Storage Tips:పసుపు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టిప్స్.. మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో మనలో చాలామంది పసుపుని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు కన్నా మనం పసుపు కొమ్ములను ఆడించుకున్న పసుపు అయితే మంచిది.

అయితే పసుపు కొమ్ములను ఒక్కసారిగా ఎక్కువగా ఆడించుకుని నిలువ చేసుకుంటే ఆ పసుపు ఎక్కువ రోజులు నిలువ లేకుండా పురుగు పట్టే అవకాశం ఉంది. పసుపు పురుగు పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

పసుపు వంటలకు మంచి రంగు రుచిని ఇవ్వటమే కాకుండా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

పసుపును గాలి చొరబడని కంటైనర్ లో ఉంచాలి. వేడి తేమ లేకుండా చూసుకోవాలి. చల్లని ఇప్పుడు ప్రదేశంలో నిల్వ చేయాలి. డబ్బాలోంచి పసుపును బయటకు తీసేటప్పుడు కచ్చితంగా తడి లేని స్పూను ఉపయోగించాలి. కచ్చితంగా ఫ్రిజ్లో నిల్వచేస్తే చాలా రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది

ఒకవేళ ముడి పసుపును నిల్వ చేయాలనుకుంటే కాగితం టవల్లో చుట్టి జిప్ లాక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని కంటైనర్ లో ఉంచి ఫ్రిజ్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల రెండు నుంచి మూడు వారాలు వరకు తాజాగా ఉంటుంది. లేదంటే ముడి పసుపును తురిమి ఐస్ క్యూబ్ ట్రైలో కూడా నిల్వ చేయొచ్చు.

పసుపును గాలి చొరబడని డబ్బాలో నిలువచేసినప్పుడు కొన్ని బిర్యానీ ఆకులు లేదంటే వేప కర్ర మొక్కలను వేస్తే తేమ, కీటకాలు, పురుగులు ఏమీ లేకుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."