ఇంట్లో కూరగాయలు లేవా? అయితే పెరుగుతో ఇలా టేస్టీ కర్రీ చేసేయండి!
ఇంట్లో కూరగాయలు లేవా? అయితే పెరుగుతో ఇలా టేస్టీ కర్రీ చేసేయండి..అప్పుడప్పుడు మార్కెట్‌కి వెళ్లడం కుదరక ఇంట్లో కూరగాయలు ఏమీ ఉండవు. అలాంటప్పుడు ఏం వండాలో అర్థం కాక కంగారు పడుతుంటాం. కానీ, మీ దగ్గర కేవలం కప్పు పెరుగు, ఉల్లిపాయలు ఉంటే చాలు.. నిమిషాల్లో ఎంతో రుచికరమైన ‘దహీ తడ్కా’ తయారు చేసుకోవచ్చు. ఇది బ్యాచిలర్స్‌కి మరియు వర్కింగ్ ఉమెన్స్‌కి తక్కువ సమయంలో అయిపోయే బెస్ట్ రెసిపీ.
కావలసిన పదార్థాలు:
పెరుగు: 1 కప్పు (గడ్డ పెరుగు అయితే బాగుంటుంది)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర స్పూన్
కారం: 1 స్పూన్
పసుపు: పావు స్పూన్
ధనియాల పొడి: అర స్పూన్
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా మెత్తగా చిలకండి. ఇందులో కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోండి. (పెరుగు మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి).
బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు మంటను తగ్గించి పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. మసాలాలు మాడిపోకుండా జాగ్రత్త పడండి.ఇప్పుడు స్టవ్ కట్టేయండి (మంట మీద పెరుగు వేస్తే విరిగిపోయే అవకాశం ఉంది). స్టవ్ ఆపాక, ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగును ఈ పోపులో వేసి బాగా కలపండి.
చివరగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు కర్రీ సిద్ధం!
ముఖ్యమైన చిట్కాలు:
పెరుగు వేసేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ ఆపండి లేదా మంటను అతి తక్కువగా ఉంచండి.
ఈ కర్రీని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే ఇందులో కొద్దిగా కసూరీ మేతీ కూడా చల్లుకోవచ్చు.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

