Movies

రెండు లేదా అంతకన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రిటీలు…ఎవరో తెలుసా?

తెర పైన వారి నటనతో స్టెప్పు లతో మనల్ని ఆకట్టుకుంటారు సినిమా హీరోలు..వారిని చూస్తూ మనం మురిసిపోతాం , వారిని పిచ్చిగా అభిమనిస్తాం. వారు నిజ జీవితం లో చేసే కొన్ని పనుల వల్ల జనాల్లో కొంత అవిశ్వాసం ఉంటుంది.ఆ హీరోయిన్ కి ఈ హీరో తో ఎఫైర్ ఉంది , ఈ హీరో కి ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ చాలా పుకార్లు వస్తాయి ..అందులో వాస్తవం ఏదైనా , కొందరు సినీ సెలబ్రిటీలు ఒకసారి పెళ్లయ్యాక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.. వారెవరో చూడండి

కమల్ హాసన్
కమల్ హాసన్ 1988లో సారికాను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఈ స్టార్ కి రెండో పెళ్లి. అంతకు ముందు డ్యాన్సర్ వాణీ గణపతిని పెళ్లి చేసుకుని 10 ఏళ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ తో గౌతమితో సహజీవనం సాగించి చివరకు ఆ బంధానికి కూడా పుల్ స్టాప్ పెట్టారు ఇరువురూ ఏకాభిప్రాయంతో..

కృష్ణ
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరో అయిన సూపర్ స్టార్ క్రిష్ణ.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట 1961లో ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 1969లో నటి విజయ నిర్మలాను పెళ్లి చేసుకున్నాడు. విజయ నిర్మలాకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం.

సీనియర్ నటుడు నరేష్
జాంబలకడి పంబ , అమృతం వంటి సీరియల్స్ తో మంచి పేరు తెచ్చుకున్న నరేష్ , ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి వేషాలు వేస్తున్నారు , అయితే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు ..

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడు పెళ్లిళ్లతో.. వార్తల్లో పాపులర్ అయ్యాడు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మొదట పెళ్లి వైజాగ్ కు చెందిన నందిని ని చేసుకుని 2008లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రముఖ కథానాయకి రేణు దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 2012లో ఆమెతో బంధానికి వీడ్కోలు చెప్పాడు. ఆ తర్వాత 2013లో రష్యాకు చెందిన నటి.. అన్నా లెజ్నావెని పెళ్లి చేసుకున్నాడు.

యువన్ శంకర్ రాజా
లెజెండరీ సంగీత సర్శకులు ఇళయరాజా గారి కుమారుడు.ఈయన తమిళ్ లో చాలా సినిమాలకు మంచి సంగీతాన్ని అందించారు.తెలుగు లో కూడా ఓయ్ , పంజా వంటి సినిమాల్లో తన సంగీతం అందించారు.యువన్ శంకర్ రాజా కూడా ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు..

నాగార్జున
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, దగ్గుబాటి లక్ష్మీ రామానాయుడిని పెళ్లి చేసుకుని ఆరేళ్ల తర్వాత విడాకులతో.. విడిపోయారు. ఈ దంపతులకు ఒక కుమారుడు. ఆ తర్వాత నటి అమలను 1992లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఒక కుమారుడు.

స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారు
విశ్వ, విఖ్యాత, నటసార్వ బౌముడిగా , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన సీనియర్ ఎన్టీఆర్ 1942లో తనకు 20 ఏళ్ల వయసులో బసవతారకం ను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ.. 12మంది పిల్లలు. ఆ తర్వాత 1993లో 70 ఏళ్ల వయసులో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు. లక్ష్మీ పార్వతికి కూడా ఇది రెండో వివాహం.

రాధిక
అలనాటి అందాల భామ రాధిక 1985లో ప్రతాప్ పోతన్ ని పెళ్లి చేసుకుంది. తర్వాత అతనికి డైవర్స్ ఇచ్చి.. లండన్ కి చెందిన రిచర్డ్ హార్డ్లీ ని పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరికి ఒక కూతురు ఉంది. ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం రాధిక, శరత్ కుమార్ తో ప్రేమలో పడి.. 2001లో పెళ్లి చేసుకుంది..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."