Politics

ఇక సెలవ్… పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి సంచలన నిర్ణయం

మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 9 సంవత్సరాల విరామం తర్వాత సినిమాల్లోకి ఖైదీ నెంబర్ 150 తో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వకపోవటంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా సినిమాలకు దగ్గరగా ఉంటున్నట్టు అర్ధం అవుతుంది. అయితే చిరు ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పలేదు. అలాగని రాజకీయాల్లో చురుగ్గా పాల్గోవటం లేదు. రీసెంట్ గా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగా పట్టు చూపించింది. కానీ చిరు ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ కి అనుకూలంగా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదంతా చూస్తూ ఉంటే చిరు సినిమాలకు ఫిక్స్ అయినట్టు కన్పిస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాతి ప్రాజెక్ట్ కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సామజిక అంశాలను కమర్షియల్ ఫార్ములాతో కలిపి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు చిరంజీవి. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయ్యాడు.

చిరంజీవి రాజకీయాలకు దూరం కావటానికి సినిమాలు కాకుండా వేరొక కారణం ఉంది. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇటువంటి సమయంలో చిరంజీవి కాంగ్రెస్ తో ఉంటే అది ఫ్యాన్స్ కి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని,తమ్ముడితో విరోధం అని ప్రచారం జరుగుతుందని భావిస్తున్నాడు.
Pawan Kalyan,Chiranjeevi
పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ని విమర్శించినా చిరుని ఎప్పుడు తప్పుపట్టలేదు. రాజకీయాల కారణంగా తమ కుటుంబంలో విభేదాలు రాకూడదని చిరు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారట.