Movies

జబర్దస్త్ పొట్టి నరేష్ గురించి బయట పడ్డ మరో నిజం…. ఏమిటో తెలిస్తే షాక్

ప్రముఖ ఛానల్ లో వస్తున్న జబర్దస్త్ కార్యక్రమానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా వచ్చిన చాలా మంది కమెడియన్స్ వెండితెర మీద కూడా ఒక వెలుగు వెలుగుతున్నారు. గురు,శుక్రు వారాల్లో రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే అందరూ టివిల ముందు సెటిల్ అయ్యిపోతారు. అనసూయ,రేష్మి యాంకర్స్ గా ఆది,సుదీర్,చంద్ర వంటి వారు ఈ కార్యక్రమం ద్వారానే పాపులారిటీ సంపాదించారు. ఈ షో లో చేసే ప్రతి ఒక్కరు ఆర్ధికంగా సెటిల్ అవ్వటమే కాకుండా సినిమాల్లోనూ,స్టేజ్ షో లు చేసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నారు. జబర్దస్త్ లో కామెడీని ఇష్టపడేవారికి నరేష్ సుపరిచితమే.

చిన్నగా ఉండే నరేష్ చేసే కామెడీ,చేష్టలు పెద్దవారు చేసే విధంగా ఉంటాయి. అసలు నరేష్ వయస్సు ఎంత అనే అనుమానం అందరిలోనూ రావటం సహజమే. నరేష్ జబర్దస్త్ కి వచ్చిన కొత్తలో భాస్కర్,సుధాకర్ స్కిట్స్ లలో చేసేవాడు. ప్రస్తుతం నరేష్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు. నరేష్ చేసే స్కిట్స్ లో కామెడీ అందరిని నవ్విస్తుంది.

ఇంతకీ నరేష్ చిన్న పిల్లవాడా లేదా పెద్దవాడా అనే సందేహం అందరిలోనూ ఉంది. నరేష్ చిన్నగా,సన్నగా ఉండటంతో అతని వయస్సు గురించి చర్చ సాగుతుంది. చూడటానికి 10 సంవత్సరాల వయస్సు కనిపించే నరేష్ అసలు వయస్సు 19 సంవత్సరాలు. అతనికి కొన్ని శారీరక సమస్యల కారణంగా మరగుజ్జుగా కన్పిస్తాడు. వయస్సు ఎక్కువగా ఉన్నా చిన్న పిల్లవాడిగా కన్పిస్తాడు.