Movies

డైరక్టర్ క్రిష్ భార్య డాక్టర్ రమ్య ఎవరి కూతురో తెలుసా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరక్టర్ క్రిష్ విడాకుల గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన భార్య డాక్టర్ రమ్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, ఆల్రెడీ డైవోర్స్ కు దరఖాస్తు కూడా చేశారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. కనీసం రెండేళ్లు గడిచాయో లేదో ఇద్దరి మధ్య విభేదాలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇద్దరి మధ్య వృత్తిపరమైన విభేదాలు వచ్చాయని, ఎవరెవరి ప్రొఫెషన్లతో వాళ్లు బిజీగా ఉండడం వల్ల దాంపత్య జీవితానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారని ఒక వర్గం అభిప్రాయపడుతుండగా, మెజారిటీ పీపుల్ మాత్రం రమ్య కాపురంలో చిచ్చు పెట్టింది ఒక హీరోయిన్ అని తీవ్రఆరోపణలు చేస్తున్నారు. అయితే తాను విడాకులు తీసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై డైరక్టర్ క్రిష్ ఇంతవరకు నోరువిప్పలేదు.

అసలు… డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం పెద్దల సమ్మతం మేరకే జరిగింది. క్రిష్, రమ్య కూడా ఒకరినొకరు ఇష్టపడిన తర్వాతే ఎంగేజ్ మెంట్ జరిగింది. రమ్య పూర్తిపేరు వెలగ రమ్యసాయి. ఆమె బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తోంది. రమ్య తండ్రి పేరు వెలగ వెంకటరమణ ప్రసాద్.

ఆయన నగరంలో పేరుమోసిన కాస్ట్ అకౌంటెన్సీ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఇక రమ్య తల్లి పేరు పద్మావతి. క్రిష్ కూడా రమ్య గురించి, ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అమ్మాయి నచ్చిందని తన తల్లిదండ్రులకు చెప్పాడట. దాంతో వాళ్లు రమ్య తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

క్రిష్, రమ్యల నిశ్చితార్థం 2016 జూన్ 25న మాదాపూర్ లోని ఓ హోటల్లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత ఆగస్ట్ 7వ తేదీన గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళయిన కొన్నాళ్లపాటు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. పెళ్లయిన కొత్తలో రమ్య కూడా క్రిష్ తో సెట్స్ మీదే కాపురం పెట్టేయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త జంట, కొత్త కాపురం అనుకుని చాలామంది సరదాగా తీసుకున్నారు.

కానీ రానురాను క్రిష్ తన సినిమాలతో బిజీగా మారడం, హాస్పిటల్ లైఫ్ తో రమ్య తన డాక్టర్ వృత్తికి న్యాయం చేయాలని ప్రయత్నించడం వాళ్ల దాంపత్య జీవనంపై ప్రభావం చూపించింది. చివరికి హీరోయిన్ తో క్రిష్ డేటింగ్ చేస్తున్నాడన్న అనుమానాలు రమ్యను విడాకుల దిశగా నడిపించినట్టు సమాచారం.

మణికర్ణిక చిత్ర షూటింగ్ కోసం క్రిష్ ముంబయిలో ఉండాల్సిరావడం, పనేమీ లేకపోయినా ఆ హీరోయిన్ కూడా ముంబయిలోనే మకాం పెట్టడం డాక్టర్ రమ్య అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టయిందని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఎవరికీ ఇబ్బంది కలగకుండా విడిపోతేనే మంచిదని ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారట. దాని ఫలితమే ఈ విడాకుల కథనాలు తెరపైకి వచ్చాయని తెలుస్తోంది.