Movies

స్టార్ హీరోయిన్ తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని తెలుసా? ఆమె ఎవరో చూడండి

హీరోలకు వయస్సు పెరిగే కొద్దీ హీరోలుగానే వేస్తుంటారు. కానీ అదే హీరోయిన్స్ విషయం తీసుకుంటే,ఏమాత్రం వయస్సు మళ్ళినా, తల్లి పాత్రలకు,అత్తమ్మ పాత్రలకు పరిమితం కావల్సిందే. అది ఎలా ఉంటుందంటే,హీరోల సరసన హీరోయిన్ గా వేసి, మళ్ళీ అదే హీరో పక్కన తల్లిగానో, అత్తగానో వేసే పరిస్థితి వస్తుంది. ఇదే తరహాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిని సుమిత్ర అనే నటి,ఆతర్వాత తల్లి పాత్రలలో దూసుకుపోతోంది. ఆమె కూతురు కూడా స్టార్ హీరోయిన్. వివరాల్లోకి వెళ్తే, లక్ష్మి సినిమాలో వెంకటేష్ చెల్లెలుగా నటించిన స్వాతి తెలుసు కదా. ఈమె అసలు పేరు ఉమా శంకర్. అమ్మా బొమ్మా, నవ్వుతూ బతకాలి,కల్యాణ రాముడు , స్వామి సినిమాల్లో నటించిన ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ నటులే కావడంతో సినీ హీరోయిన్ కావాలని భావించి ఇండస్ట్రీకి వచ్చింది.

స్వామి సినిమాలో హరికృష్ణ చెల్లెళ్లుగా డబుల్ రోల్ పోషించిన ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు, తమిళ,కన్నడ,మలయాళ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో రాణిస్తోంది. ఇక ఈమె తల్లి సుమిత్ర ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది అయితే హీరోయిన్ గా చేసినవి తక్కువ సినిమాలు కావడం,అవి కూడా తమిళ సినిమాలు కావడం, ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ కి పరిమితం కావడం వలన ఈమె సపోర్టింగ్ యాక్ట్రెస్ గానే జనంలో బాగా తెల్సు.

చిన్నవయస్సులోనే అంటే 19ఏళ్ళ వయసులోనే నర్తనశాల అనే మలయాళ సినిమాలో నటించిన ఈమె మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఒక్క సినిమాతో ఏకంగా 12ఏళ్ళు స్టార్ హీరోయిన్ గా తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఓ వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో ఏకంగా 200సినిమాల్లో సుమిత్ర హీరోయిన్ గా వేసింది. ఇక కన్నడంలో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో కన్నడ దర్శకుడు డాక్టర్ డి రాజేంద్రబాబు ని ప్రేమించి పెళ్లాడింది.

పెళ్లాయ్యాక హీరోయిన్ ఛాన్స్ లు తగ్గిపోవడంతో 1990నుంచి ఇప్పటివరకూ అమ్మ పాత్రల్లో రాణిస్తోంది. బ్రహ్మరుద్రుడు,అహ నా పెళ్ళంట,గీతాంజలి, బొబ్బిలి రాజా,పెళ్లిచేసుకుందాం,సంతోషం,జై చిరంజీవ వంటి చిత్రాల్లో అమ్మ పాత్రల్లో ఒదిగిపోయి,మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోలందరికీ తల్లి పాత్రలు నటించిన ఈమె 100పైగా చిత్రాల్లో తల్లి పాత్రలను పోషించింది. రజనీకాంత్ , కమలహాసన్ సరసన నటించిన ఈమె వారికి తల్లి పాత్రలు వేసి మెప్పించింది.