Movies

బాహుబలి చైల్డ్ ఆర్టిస్ట్ నిఖిల్ గుర్తు ఉన్నాడా…. కొన్ని షాకింగ్ విషయాలు

మిగతా విషయాలు ఎలా వున్నా, బాలనటులుగా వచ్చినవాళ్లకు తెలుగు సినీ ఇండస్ట్రీలో కి వచ్చిన వాళ్లకు మంచి భవిష్యత్తు మాత్రం ఉంటుంది. ఇక ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసిన నిఖిల్ గురించి చెప్పుకోవాల్సి వస్తే,లవ్ లీ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అమలాపురం దగ్గరలోని నేదునూరు గ్రామంలో జన్మించిన నిఖిల్ అసలు పేరు నిఖిలేశ్వర్. యితడు దాదాపు 50సినిమాల్లో నటించాడు. ఇంకా సినిమాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నాడు. అయితే వృత్తిరీత్యా అతడి పేరెంట్స్ హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అయినప్పటికీ విశాఖలోని బంధువుల ఇళ్లకు వెళ్లివస్తుంటారు.

ప్రస్తుతం ఇంటర్ విజయవంతంగా పూర్తిచేసి గ్రాడ్యుయేషన్ చదవడానికి సన్నద్ధం అవుతున్నాడు. ఇక నిఖిల్ కి సినీ ఛాన్స్ డాన్స్ మాస్టర్ వలన వచ్చింది. నిఖిల్ వేసిన డాన్స్ చూసి అతడి ముఖంలో హావభావాలు చూసి,లవ్ లీ మూవీలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చేలా సహకరించాడు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలిలో చిన్ననాటి బాహబలిగా అద్భుత నటన ప్రదర్శించాడు. నిజానికి ఈ మూవీలో నటించడం నిజంగా అదృష్టమని,ఆ సినిమాతోనే జూనియర్ బాహుబలిగా గుర్తింపు పొందానని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

నిజానికి బాహుబలి లో ఛాన్స్ ఎలా వచ్చిందో నిఖిల్ వివరిస్తూ, ‘బాహుబలిలో చిన్ననాటి బాహుబలికోసం ఆడిషన్స్ జరుగుతుంటే వెళ్ళాను. అక్కడ విజయేంద్ర ప్రసాద్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అనివిధంగా నేను ఎంపికయ్యాను. ఎన్టీఆర్, ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం’అని చెప్పాడు. కాగా పవన్ తో నటించే ఛాన్స్ తృటిలో నిఖిల్ మిస్సయ్యాడు.

కాటం రాయుడు మూవీలో ఛాన్స్ వచ్చినా, మిగిలిన సినిమాల్లో బిజీ వలన ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. దాంతో పలుసార్లు ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుని నిఖిల్ చాలా ఫీలయ్యాడట. పవన్ తో నటించే ఛాన్స్ కోసం మళ్ళీ ఎదురుచూస్తున్నానని చెబుతూ ,పెద్దయ్యాక ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరుతెచ్చుకోవాలని ఉందని అంటున్నాడు. చూద్దాం నిఖిల్ భవిష్యత్తు ఎలా ఉంటుందో.