సుహాసిని నామినేషన్ వేసిన వెంటనే ఏమి చేసిందో చూడండి… నమ్మలేరు
తెలంగాణా ఎన్నికల్లో కూకట్ పల్లి నుంచి టిడిపి అభ్యర్థిగా నందమూరి సుహాసిని బరిలో దిగారు. అనూహ్యంగా టికెట్ కేటాయించడంతో బాబాయ్ బాలకృష్ణను వెంటబెట్టుకుని వెళ్లి నామినేషన్ వేసింది. అంతకు ముందు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతయ్య ఎన్టీఆర్,తండ్రి హరికృష్ణ లకు నివాళులర్పించింది. నామినేషన్ వేసిన అనంతరం పుట్టింటికి వెళ్లి తండ్రి చిత్రపటాన్ని చూసి భావోద్వేగానికి గురైందట. ఇక ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా గల కూకట్ పల్లి సీటును కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి సీట్ల పంపకంలో టిడిపి కి వచ్చింది. దీంతో ఈ సీటుపై చాలామంది టిడిపి నేతల కళ్ళు పడ్డాయి. అయితే హరికృష్ణ మరణంతో ఆ కుటుంబం నుంచి ఎవరోఒకరికి సీటు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించి,సుహాసిని కి టికెట్ ఇచ్చారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యామిలీ లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇక ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ లు ఎంతో సంతోషిస్తున్నారు.
ఇప్పటికే తారక్,కళ్యాణ్ రామ్ లు సుహాసిని గెలుపు కోసం అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాతాయ్య వాడిన,నాన్న నడిపిన చైతన్య రధాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని సుహాసిని భావిస్తోందట. ఈమేరకు తారక్,కళ్యాణ్ రామ్ లు సలహా ఇచ్చారట. ఇక ఎన్నికల ఎక్కువ సమయం లేనందున ఎక్కువ మంది జనాన్ని కలవడంతో పాటు సోషల్ మీడియా ద్వారా మరింతమందికి దగ్గరయ్యేందుకు ఫేస్ బుక్ పేజీ కూడా ఓపెన్ చేయాలనీ సుహాసిని నిర్ణయించుకున్నారట.
కాగా నామినేషన్ వేసే సమయంలో వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ సుహాసిని గెలుపుకోసం సాయిశక్తుల కృషి చేస్తానని తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని ప్రకటించాడు. పుట్టింట్లో తల్లి లక్ష్మి ఆశీర్వాదం తీసుకున్న సుహాసిని నాన్న బతికుంటే నేను రాజకీయాల్లో చేరినందుకు ఎంతో సంతోష పడేవాడని ఎమోషనల్ అయింది. దీనిపై తల్లి లక్ష్మి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారట. తండ్రి ఆశయాలు నిలబెట్టాలంటే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని కూతురికి తల్లి సూచించారట.
పేదవాళ్లకు, అభిమానులకు లేదనకుండా సాయం చేయడమే హరికృష్ణ తొలి ప్రాధ్యాన్యతగా ఆమె పేర్కొంటూ అయన అడుగుజాడల్లోనే నడవాలని తల్లి లక్ష్మి చెప్పారట. ఇక వివిధ కార్యక్రమాల్లో బిజీ గా ఉండడం వలన నామినేషన్ సమయానికి రాలేకపోయిన కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ లు తర్వాత సుహాసిని ఫోన్ చేసి అభినందిస్తూ,తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారట. ఎన్నికల్లో సోదరి విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతామని ప్రకటించారట.