ఇందిరా గాంధీ జీవితంలో ఎవరు నమ్మలేని 3 నిజాలు
తెగువ,చొరవ ఉంటె ఏదైనా అవలీలగా సాధించవచ్చని భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని చూస్తే అర్ధం అవుతుంది. ధైర్యం,పట్టుదల కూడా తోడైతే ఇక తిరుగుండదు. ఇందిరా గాంధీ పేరుచెబితే చాలు భారత రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలు అని చెప్పవచ్చు. సాహసానికి,కఠిన నిర్ణయాలు తీసుకోడానికి మారుపేరు గా నిల్చిన ఇందిరాగాంధీ,ఓ మహిళ అయినప్పటికీ మహిళలు ఎందులోనూ తీసిపోరని పాలనలో తన సత్తా చాటింది. అందుకే ఇండియాయే ఇందిర – ఇందిరే ఇండియా అని ఒకపుడు నినాదం మారుమోగింది.
సంక్షోభ సమయంలో కూడా బెణుకు అనేది లేకుండా వ్యవహరించి,ఏకచత్రాధిపత్యంగా పాలన సాగించింది. విపక్ష నేతలు సైతం ఆమెను మెచ్చుకున్న సందర్భాలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత నేతలతో పోటీపడి ప్రధానికి భారతదేశాన్ని ఆయా రంగాల్లో శిఖరాగ్రాన నిలిపిన ఘనత ఆమెది. భారత తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఏకైక కుమార్తె అయిన ఇందిరాగాంధీ పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని.
జవహర్ లాల్ నెహ్రు ,కమలానెహ్రూ లకు 1917నవంబర్ 19న ఏకైక సంతానంగా జన్మించిన ఇందిర స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. 18ఏళ్ళ వయస్సులో ఈమె వానర సేనను ఏర్పాటుచేసి ఉద్యమం నడిపింది. విదేశీ వస్త్ర బహిష్కరణలో చురుగ్గా పాల్గొంది. 1936లో తల్లి కమలానెహ్రూ ని కోల్పోవడంతో 1938లో భారతజాతీయ కాంగ్రెస్ లో చేరింది. బెంగాల్ విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివంది. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లో చదివేటప్పుడే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా లండన్ లో స్థాపించిన ఇండియా లీగ్ లో చేరింది.
జర్నలిస్ట్ ఫిరోజ్ తో పరిచయం క్రమేపి ప్రేమగా మారింది. అయితే పెళ్ళికి నెహ్రు అడ్డు చెప్పడంతో ఫిరోజ్ ని గాంధీ దత్తత తీసుకుని పెళ్ళికి ఒకే అనిపించాడు. దీంతో 1942లో ఇందిర, ఫిరోజ్ గాంధీల పెళ్లి జరిగింది. భర్తతో కల్సి అలహాబాద్ లో ఉంటున్న ఇందిరకు భర్తతో విబేధాలు రావడంతో ఢిల్లీకి వచ్చేసి,తండ్రితో ఉండేది. 1951లో జరిగిన ఎన్నికల్లో యూపీలోని రాయబరేలి నుంచి నెహ్రూపై ఫిరోజ్ బరిలో దిగడంతో తండ్రి తరపున ఇందిర ప్రచారం చేసి, తండ్రి గెలుపులో కీలక పాత్ర పోషించింది.
1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఆమె 1960లో ఫిరోజ్ గాంధీ మరణించాడు. ఇక 1964లో నెహ్రు మరణంతో ఇందిర జీవితంలో పెను విషాదం ఏర్పడింది. అయితే రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో కేబినెట్ హోదా గల సమాచార ప్రచార శాఖ మంత్రి అయింది. శాస్త్రీజీ మరణంతో 1966లో ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టింది. దేశ మొదటి మహిళా ప్రధానిగా సంచలనం సృష్టించింది. ఇంకా చెప్పాలంటే, ఇప్పటివరకూ కూడా మరో మహిళ ఆ స్థానానికి చేరుకోలేకపోయింది. కనుచూపు మేరలో కనిపించడం లేదు.
1966 నుంచి 1977వరకు వరుసగా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది. 1980లో నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. అయితే 1977లో దేశంలో ఎమర్జెన్సీ విధించడం ఇందిరకు ఎదురు దెబ్బ తగిలింది. అందుకే 1977ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేకాదు ఆమె ప్రాతినిధ్యం వహించే రాయబరేలీలో కూడా రాజ్ నారాయణ్ చేతిలో ఓటమి చెందింది. ఇక ఆతర్వాత 1978ఉపఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటుచేసి విజయం సాధించింది. ఇక 1980మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ప్రధాని అయ్యారు. అప్పుడే మెదక్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఘనవిజయం సాధించారు. 1984లో సొంత బాడీగార్డులు చేతిలో తుపాకీ గుళ్లకు బలైంది.