Movies

రోబోకు కళ్లద్దాలు పెట్టడం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా?

చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు ఈ రోజు పండుగ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ‘2.ఓ’సినిమా దేశ వ్యాప్తంగా విడుదల అయింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను 600 కోట్లతో తెరకెక్కించారు. ఈ సినిమాలో రోబో పాత్ర కోసం యానిమేషన్‌కు హాలీవుడ్‌ టెక్నాలజీని వాడారట. ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ కి చాలా ఖర్చు అయింది. సినిమా నిర్మాణంలో గ్రాఫిక్స్ భారీ స్థాయిలో ఉపయోగించారు.

ఈ సినిమాకి గ్రాఫిక్స్‌ అందించిన శ్రీనివాసన్‌ తాజాగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విఎఫ్‌ఎక్స్‌ గురించిన ఆసక్తికర విషయాలను చెప్పారు. ఈ సినిమా కోసం నెలల తరబడి చాలా మంది వర్క్ చేశామని, ఈ సినిమాలో రోబోకి కళ్లద్దాలు పెట్టటం వెనక రహస్యాన్ని కూడా చెప్పారు.

రోబో కళ్లను మరియు కనుబొమ్మలను యానిమేట్‌ చేయడం అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్నది. అందుకోసం నిష్ణాతులైన యానిమేటర్స్‌ కావాల్సి ఉంటుంది. అందుకే రోబో కళ్లు మరియు కనుబొమ్ము కవర్‌ అయ్యేలా కళ్లద్దాలు పెట్టేశాం. ఆలా బడ్జెట్ కూడా తగ్గింది. కళ్లు, కను రెప్పల వెంట్రుకలు యానిమేట్‌ చేయకుండా కళ్లజోడును సింపుల్‌గా యానిమేట్‌ చేసేయడం వల్ల చాలా పని తగ్గింది.

దాంతో పాటు కోట్ల రూపాయల డబ్బు కూడా సేవ్‌ అయ్యిందని ఈ సందర్బంగా శ్రీనివాసన్‌ పేర్కొన్నాడు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన కొంత బడ్జెట్ ని కూడా తగ్గించగలిగామని చెప్పారు.