Devotional

భస్మం అనే మాటకు అర్థమేమిటంటే….


భస్మం అనే మాటకు అర్థమేమిటంటే.. భస్మం అనే మాటకు పాపాలను భస్మం చేసేదని పండితులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే భస్మం అనేది భగవంతుడిని జ్ఞాపకం చేసేదని అర్థం. ‘భ’ అంటే భస్మం చేయడం. ‘స్మ’ స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మం ధరించిన వారికి శోభనిస్తుంది కనుక విభూతి అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టశక్తుల నుండి రక్షిస్తుంది కనుక రక్ష అని అంటారు.

ఏదైనా ఒక వస్తువును లేదా పదార్ధాన్ని కాల్చినప్పుడు బూడిదగా మారుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ మార్పూ జరగదు. ఎంతమాత్రం రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో మార్పులేని మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదని పురోహితులు చెబుతున్నారు.

నెయ్యి, ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులో నుండి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకం చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగణించబడదని పండితులు చెబుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."