హీరో రామ్ కి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?

వైవిఎస్ చౌదరి తీసిన దేవదాసు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి వైవిధ్యమైన పాత్రలతో స్టార్ హీరోగా ఎదిగిన రామ్ తాజాగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించాడు. పూర్తి మాస్ ఇమేజ్ తో వచ్చిన ఈమూవీలో తెలంగాణా యాసలో డైలాగులు అవలీలగా చెప్పేసాడు. ఇక సినీ పరిశ్రమతో సంబంధం గల ఫ్యామిలీయే. ఇతడి అసలు పేరు పోతినేని రామ్. ఇతడి తండ్రి పోతినేని మురళీమోహన్. తల్లి పందశ్రీ. 1988మే15న హైదరాబాద్ లో పుట్టాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన స్రవంతి మూవీస్ రవికిశోర్ స్వయానా రామ్ కి పెదనాన్న. ఫ్యామిలీ  చెన్నైలో సెటిల్ అవ్వడంతో రామ్ చదువు అక్కడే పూర్తయింది. 

పదవతరగతి వరకూ మాత్రమే చదివి ఆతర్వాత సినిమాల్లో చేరతానని అనడంతో అతడిని పేరెంట్స్ ఓ ఫిలిం ట్రైనింగ్ సెంటర్ లో చేర్చారు. శిక్షణ పొందే సమయంలోనే పెదనాన్న తో కల్సి షూటింగ్ లొకేషన్స్ కి వెళ్లేవాడట. అక్కడ నటీనటుల అభినయం చూసి మరింతగా నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. తమిళంలో ఓ షార్ట్ ఫిలిం లో చేసి,యూరోపియన్ ఫిలిం ఫెస్టివెల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేసాడు. కాదల్ సినిమాలో మెయిన్ రోల్ కోసం ఆడిషన్స్ కి వెళ్లి సెలక్ట్ కాలేదు. భరత్ తో ఆ సినిమా తీశారు. 

ఇక ఫిలిం శిక్షణ పొందే సమయంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరితో రామ్ కి పరిచయం ఏర్పడింది. అప్పుడే ఇచ్చిన హామీ మేరకు దేవదాస్ మూవీని డైరెక్ట్ చేసి తెలుగు ఇండస్ట్రీకి రామ్ ని పరిచయం చేసాడు. 17ఏళ్ళ వయస్సులోనే చేసిన ఈ సినిమా 2006లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు. జగడం,రెడీ, రామ రామ కృష్ణ కృష్ణ, మస్కా, గణేష్, కందిరీగ, ఎందుకింత ప్రేమంట,ఒంగోలు గిత్త,పండగ చేసుకో,మసాలా ,పవర్, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ,హలొ గురూ ప్రేమకోసమే వంటి మూవీస్ లో నటించాడు. తాజాగా రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ విజయంతో మరిన్ని కొత్త కథలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.