Movies

కిక్ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…లాభం ఎన్ని కొట్లో…?

హాస్యం,సీరియస్ నెస్ మేళవించి ఆడియన్స్ కి వినోదం పంచుతూ ఇచ్చిన కిక్కే ‘కిక్’మూవీ. రవితేజ రొటీన్ మూవీస్ కి భిన్నంగా వచ్చిన ఈమూవీ ని సురేంద్ర రెడ్డి డైరెక్ట్ చేసాడు. మొదటి సినిమా హిట్ తర్వాత రెండు సినిమాలు నిరాశ పరచడంతో సురేంద్ర రెడ్డి కసిగా తీసిన కిక్ మూవీ 220సెంటర్స్ లో 50రోజులు,55సెంటర్స్ లో 100రోజులు ఆడింది.

40కోట్లకు పైనే గ్రాస్ వసూలు చేసింది. 28కోట్ల షేర్ తో జల్సా మూవీతో కల్సి ఆల్ టైం 5గా నిల్చింది. 2009లో హయ్యస్ట్ షేర్ సాధించిన టాప్ 3మూవీగా రికార్డుకెక్కింది. విషయాల్లోకి వెళ్తే, .. చుక్క రక్తం లేకుండా నడిచేలా ఆరునెలల పాటు వక్కంతం వంశీతో కల్సి కథపై కసరత్తు చేసాడు. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ కిక్కు ఇచ్చాయి.

ఇక ఈ మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలని అనుకున్నాడు. కానీ ఇలాంటి ప్రయోగం ఇప్పుడు అవసరమా అని తారక్ రిజెక్ట్ చేసాడు.

ప్రభాస్ ని కలిసినా ప్రయోజనం లేకపోవడంతో దీనికి సరైన హీరో రవితేజ అని భావించి ఎప్రోచ్ అయ్యాడు.

అప్పటికే కృష్ణవంశీతో కందిరీగ చేయడానికి సిద్ధపడ్డ రవితేజ ఆ మూవీ బడ్జెట్ కారణంగా ఆలస్యం అవుతుందని భావించి,కిక్ కి కమిట్ అయ్యాడు. హీరోయిన్ గా ఇలియానా సెలెక్ట్ అయింది.

కోట శ్రీనివాసరావు, రావు రమేష్, బ్రహ్మానందం, షియాజీ షిండే,వేణుమాధవ్ ఇలా అందరూ కుదిరారు. అయితే పోలీస్ క్యారెక్టర్ కోసం జగపతి బాబు లాంటి వాళ్ళను అనుకున్నా చివరకు శ్యాం ని ఎంపికచేయడం,అతడు ఒకే చేయడంతో అన్నీ అమరాయి.

ఇక 2008అక్టోబర్ 9న రామానాయుడు స్టూడియోలో షూటింగ్ స్టార్ట్ చేసి,రామోజీ ఫిలిం సిటీ, సంఘీ టెంపుల్,తో పాటు మలేషియాలో భారీ షెడ్యూల్ చేసారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆ పాట తీశారు.

ఏప్రియల్ 2009నాటికి షూటింగ్ 14కోట్ల బడ్జెట్ తో పూర్తయింది. ఏప్రియల్ 19న ఆడియో రిలీజ్ అయింది.

మే8న భారీ అంచనాలతో రిలీజయింది. హాస్యం,సీరియస్ నెస్, రవితేజ చెలరేగుతూ చేసిన నటన,ఇలియానా గ్లామర్ అన్నీ కలిసివచ్చి,ఈ సినిమా సురేంద్ర రెడ్డిని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టగా, వక్కంతం వంశీ స్టార్ రైటర్ అయ్యాడు.

ఇక రవితేజ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అయింది. రెండో సినిమా కిక్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."