Movies

రజనీ పక్కన ఉన్నఈ మ్యూజిక్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా….అయితే వెంటనే చూసేయండి

లాక్ డౌన్ సమయంలో స్టార్ హీరోలు,సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ తో అదరగొట్టేస్తున్నారు. తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇందులో కొన్ని ఫోటోలు బాగా ఆకర్షిస్తూ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మ్యూజిక్ డైరెక్టర్ కోటి దగ్గర కీ బోర్డు ప్లేయర్ గా జీవితాన్ని ప్రారంభించి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహ్మాన్ ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాగే తమిళనాట అనిరుద్ రవిచందర్ కూడా పలువురు స్టార్ హీరోల మూవీస్ కి సంగీతం అందించాడు. యితడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మేనల్లుడు అవుతాడు.

రజనీకాంత్ నటించిన దర్బార్ మూవీకి,ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీకి సంగీతం అందించిన అనిరుద్ తాజాగా భారతీయుడు 2 మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. కమల్ హాసన్ ఇందులో హీరో గా చేస్తున్న సంగతి తెల్సిందే. కాగా రజనీకాంత్ ,ఏ ఆర్ రెహ్మాన్ లతో అనిరుద్ చిన్నప్పుడు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.