Healthhealth tips in telugu

టీవి చూస్తూ నిద్రపోతున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Side effects of sleeping watching tv :మనలో చాలా మంది టీవీ చూస్తూ అలా నిద్రపోతూ ఉంటారు .ఇలా నిద్ర పోవడం మంచిదేనా అనే విషయం ఈ రోజు తెలుసుకుందాం. శరీరానికి నిద్ర చాలా అవసరం సరిపడా నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా ఎనర్జిటిక్ గా ఉంటాం. లేదంటే రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకే నిపుణులు రోజుల్లో 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి అని చెబుతూ ఉంటారు.

ఇక అసలు విషయంలోకి వస్తే కొంతమంది రోజంతా ఇంటి పనులతో లేదా ఆఫీస్ పనులతో అలిసిపోయి టీవీ చూస్తూ నిద్ర పోతూ ఉంటారు. అలా నిద్రపోవటం వలన కొంచెం సేపటికే మెలకువ వచ్చేస్తుంది మళ్లీ కాసేపు టీవీ చూస్తారు. మళ్లీ పడుకుంటారు మళ్లీ మెళుకువ వస్తుంది. ఇలా చేయటం వలన నిద్ర సరిగా పట్టదు.

నిద్ర సరిగా లేకపోతే శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గి ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది అంతేకాకుండా నిద్రలేమి తలనొప్పి హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి టీవీ చూస్తూ పడుకునే అలవాటు ఉంటే మానుకోండి. ఎంతసేపు చూడాలి అనిపిస్తే అంత సేపు టీవీ చూసి ఆ తర్వాత పడుకుంటే మంచిది. ప్రతి మనిషికి సరిపడా నిద్ర అవసరం.