Healthhealth tips in telugu

పాలల్లో కలిపి తాగితే..99 % మోకాళ్ళ నొప్పులు,నరాలనొప్పులు,అధికబరువు తగ్గి జీవితంలో కాల్షియం లోపం ఉండదు

Joint Pains Home Remedies In telugu :ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు కారణం కాల్షియం లోపం ఉండటం. అందువల్ల కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి అప్పుడు ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి ఎటువంటి నొప్పులు ఉండవు.

అంతేకాకుండా సిరలో అడ్డంకులు కండరాల వాపు లు ఎముకలు బలహీనంగా ఉండటం కూర్చుని లేవటానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉన్నాయంటే డాక్టర్ కాల్షియం టాబ్లెట్ వాడమని చెబుతారు అయితే సమస్య చిన్నగా ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది

గిన్నెలో ఒక గ్లాస్ పాలు పోసి కాస్త వేడెక్కాక ఒక స్పూన్ సొంపు,చిన్న ముక్క దాల్చిన చెక్క,చిన్న అల్లం ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి కొంచెం బెల్లం వేసి తాగితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. డయబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ పాలను ఏ సమయంలోనైనా తాగవచ్చు. శరీరంలో రోగనిరోదక శక్తి కూడా పెరుగుతుంది.

ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అదే సమస్య పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా పాటిస్తూ ఈ పాలను తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి. చిన్న చిన్న సమస్యలకు మందులు వాడవలసిన అవసరం లేదు.