కేవలం అర గ్లాస్ తాగితే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 100% రోగనిరోదకశక్తి పెరుగుతుంది
Immunity Drink Benefits : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవలసిన అవసరం ఉంది. అలాగే దగ్గు, గొంతులో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఈ రోజు ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు శ్వాసలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు
ప్రతీ ఒక్కరికీ రోగనిరోధక శక్తి ఎంత ఇంపార్టెంటో తెలిసిపోయింది. ఆ కారణంగానే మార్కెట్లోకి రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఆహారాలు, పానీయాలు లభ్యం అవుతున్నాయి. జలుబు, దగ్గు వంటి తేలికపాటి లక్షణాలని తగ్గించడానికి రోగనిరోధక శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే చాలా వాటిల్లో సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి.
ఈ డ్రింక్ తయారుచేసుకోవటానికి అవసరం అయినా అన్నీ ఇంగ్రిడియన్స్ మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కాక దానిలో చిన్న అల్లం ముక్క, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా ఒక అంగుళం దాల్చినచెక్క వేసి 2 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత పావుస్పూన్ పసుపు వేసి మరో 2 నిమిషాలు మరిగించాలి.
బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి దానిలో అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని ఉదయం,సాయంత్రం తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు.
మందులు వాడటం కంటే… మూలికలు వాడటం మేలన్న విషయం మనకు తెలిసిందే. ఈ డ్రింక్ తాగితే… ఇన్ఫెక్షన్లు రావు. జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరంలో విష వ్యర్థాలు బయటకు పోతాయి.