పరగడుపున తాగితే పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు ఉండవు

Gas Problem Home Remedies : ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు, మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న ప్పుడు, తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ ఉంటారు.
sompu
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం వస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా కడుపు కూడా శుభ్రం అవుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాస్ లో నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు, రెండు రెమ్మల కరివేపాకు ఆకులను వేసి…గ్లాస్ లో నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగటం వలన పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.

అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారిలో శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్యాస్ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.