కిడ్నీలో రాళ్ళూ ఏర్పడకుండా ఉండాలంటే….ఈ ఆహారాలు తప్పనిసరి

kidney stones :మన మొత్తం శరీరాన్ని శుద్ధిగా ఉంచాలంటే కిడ్నీల పనితీరు బాగుండాలి. కిడ్నీల పనితీరు బాగా లేకపోతే శరీరం మొత్తం అస్తవ్యస్తం అయ్యిపోతుంది. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి. ఆహారాలను తరచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడటం,కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.
garlic
వెల్లుల్లి
వెల్లుల్లిని సూపర్ ఆహారంగా చెప్పవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ మరియు యాంటీ క్లోటింగ్‌ కణాలు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడానికి శరీరం మొత్తాన్ని శోధిస్తుంది.

బెర్రీస్‌
బెర్రీస్‌ అనేక రంగుల్లో లభ్యం అవుతాయి. ఈ రకాల్లో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగతా అన్ని రకాలను తినవచ్చు. స్ట్రాబెర్రీ, క్రాన్‌ బెర్రీస్‌, రాస్పెరీస్‌ మరియు బ్లూబెర్రీస్‌ అన్నింటిలోనూ న్యూట్రిషియన్స్‌ మరియు యాంటీఇన్‌ప్లమేటరి గుణాలు సమృద్ధిగా ఉండుట వలన వ్యాధి నిరోధకతను పెంచి బ్లాడర్‌ ఫంక్షన్స్‌ సక్రమంగా ఉండేలా సహాయపడతాయి.
sprouts benefits
మొలకెత్తిన విత్తనాలు
పచ్చివి చిరుధాన్యాలు మొల కెత్తించి తినడం వల్ల శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మూత్రపిండాలను శుభ్రపరచి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.
Cabbage side effects in telugu
క్యాబేజ్‌
క్యాబేజ్‌ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్‌ను మూత్రపిండాల డ్యామేజ్‌ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

ఉల్లిపాయలు
ఉల్లిపాయలు, కిడ్నీలోని రాళ్ళను సహజంగా తొలగించడానికి సహాయపడుతాయి. అంతేకాదు. మూత్రపిండాలను నిర్విషీకరణం మరియు మూత్రపిండాల శుభ్రతలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.