Healthhealth tips in telugu

1 లడ్డు తింటే శారీరక బలహీనత,అలసట,నీరసం,తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి

Energy Booster Laddu : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదొక సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు చెప్పే లడ్డు తింటే ఎన్నో రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. లడ్డు తయారీ చాలా సులువు. కాస్త ఓపికగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇంటిలో తయారుచేసుకుంటే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.
Diabetes patients eat almonds In Telugu
పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఒక కప్పు గోధుమ పిండి వేసి 4 నిమిషాలు వేగించాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. 3 నిమిషాలు వేగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో 4 స్పూన్ల బాదం పప్పు ముక్కలు, ఒక స్పూన్ పిస్తా పప్పు ముక్కలు,ఒక స్పూన్ గసగసాలు,మూడు స్పూన్ల కొబ్బరి పొడి వేసి వేగించాలి.

ఈ మిశ్రమాన్ని గోధుమ పిండి బౌల్ లో వేయాలి. అరకప్పు పటికబెల్లం పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర స్పూన్ యాలకులపొడి, ఒక స్పూన్ సొంపు పొడి, ఒక స్పూన్ పుచ్చగింజలు, మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి చిన్న లడ్డూలా మాదిరిగా చేసుకోవాలి. ఈ లడ్డూలు దాదాపుగా 15 రోజులు నిల్వ ఉంటాయి.

ఈ లడ్డులను ప్రతి రోజు ఒకటి తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.శారీరక బలహీనత, అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా తలనొప్పి వంటి సమస్యలు కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.