Healthhealth tips in telugu

1 గ్లాస్ 15 రోజులు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది

weight Loss Tips In telugu : ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. చాలామంది అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా సహజసిద్దంగా దొరికే వస్తువులతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే రెమెడీని ఫాలో అయితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
Weight Loss tips in telugu
ఈ రెమిడీని ఫాలో అయితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ రెమిడీ కోసం బెల్లం,నిమ్మరసం,మిరియాల పొడి తీసుకుంటున్నాం. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బెల్లం తురుము వేసి బాగా కరిగేవరకు కలపాలి. ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. ఆ తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

ఈ డ్రింక్ ని ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తాగితే గ్యాస్ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అరగంట తర్వాత తాగితే సరిపోతుంది.
lemon benefits
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా కొవ్వును కరిగించటానికి సహాయపడతాయి. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి.
jaggery Health benefits in telugu
బెల్లంలో కేలరీలు తక్కువగాను యాంటీఆక్సిడెంట్లు, జింక్ మరియు సెలీనియం సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేయటమే కాకుండా టాక్సిన్స్‌ను బయటకు పంపటంలో సహాయపడుతుంది. ఈ డ్రింక్ తాగటం వలన ఊపిరితిత్తులు శుభ్రం అవ్వటమే కాకుండా ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల ఉపశమనం కలిగించటంలో సహాయపడుతుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.