Healthhealth tips in telugu

పైసా ఖర్చులేకుండా ఎన్నో వ్యాధులను నయం చేసే ఈ మొక్క కనిపిస్తే అసలు వదలకండి

Gangavalli kura Benefits in Telugu : మనలో కొంతమందికి గంగవాయిల కూర గురించి తెలుసు. దీనిని కూర, పచ్చడిగా చేసు కుంటారు. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ఆకుకూరను తింటే ఎన్నో వ్యాధులను తగ్గించటానికి సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.
gangapaya aku
ఈ మొక్క పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆకు కూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే తినని వారు కూడా తింటారు. ఈ మొక్కను ఒకసారి వేసుకుంటే సులభంగానే పెరిగిపోతుంది. పెద్దగా సంరక్షణ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆకులలో సమృద్ధిగా ఉండే విటమిన్ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.
Immunity foods
అంతేకాకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఆరోగ్యకరమైన కణ విభజనకు మద్దతు ఇస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి కొల్లజెన్ రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచటానికి సహాయపడుతుంది. దీనిలో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో ఫ్రీరాడికల్స్ ని తరిమి కొట్టడానికి సహాయపడుతుంది

దాంతో ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కాల్షియం,మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు పెళుసుగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం ఎముకల కణాల పెరుగుదలను ప్రభావితం చేసి ఎముకలు బలహీనంగా లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది
Gangapayala aaku benefits
వారంలో రెండుసార్లు ఈ ఆకు కూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది. చాలా తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలు కలిగిన ఈ ఆకుకూరను తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఈ కాలంలో చాలా విరివిగా లభ్యం అవుతుంది. కాబట్టి మిస్ కాకుండా ఈ కూరను తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.