Healthhealth tips in telugu

అర స్పూన్ పొడి నీళ్ళలో కలిపి తాగితే కీళ్ల నొప్పులు,కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరుగుతుంది

Joint pains Home Remedies in telugu : కీళ్ల మధ్య జిగురు అనేది కీళ్ళు సాఫీగా కదిలేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి కీళ్ళు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
sonthi podi health benefits in telugu
అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ రెమిడీ ఫాలో అవ్వవచ్చు. దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ముందుగా 50 గ్రాముల శొంఠిని ముక్కలుగా కట్ చేసి నూనె లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము తీసుకొని పాన్ లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.
fenugreek seeds
మెంతులు,వాము పొడిలో శొంఠి పొడిని కలపాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజులు తాగితే చాలా తేడా కనిపించి ఆశ్చర్యం కలుగుతుంది.

మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లే మేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పి,వాపును తగ్గించటంలో సహాయపడతాయి. శొంఠిలో ఉన్న లక్షణాలు కీళ్ల వాపులను తగిస్తాయి. ఈ పొడి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది. కాస్త సమయాన్ని కేటాయించి శ్రద్ధ పెడితే సరిపోతుంది.
Joint Pains
ఈ మధ్య కాలంలో 30 ఏళ్ళు వచ్చేసరికి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేస్తున్నాయి. నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. వాము,శొంఠి,మెంతులు…ఈ మూడింటిలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.