1 గ్లాసు 30 రోజులు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా నీరసం,అలసట ఉండవు

Weight Loss Juice In Telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యలలో అధిక బరువు సమస్య అనేది మొదటి స్థానంలో ఉన్నది. బరువు పెరగడం అనేది చాలా సులభంగా జరిగిపోతుంది. కానీ ఆ బరువు తగ్గటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బరువును ఎప్పుడైనా ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గాలి.

ఒక్కసారిగా ఎక్కువ కేజీల బరువు తగ్గకూడదు. ఇప్పుడు చెప్పే జ్యూస్ నెల రోజుల పాటు తాగితే బరువు ఖచ్చితంగా తగ్గుతారు. మిక్సీ జార్ లో ఒక క్యారెట్ ని శుభ్రంగా కడిగి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెడ్ కాప్సికంను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత ఒక టమాటాను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక గ్రీన్ ఆపిల్ ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల ఒట్స్, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Joint Pains
ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో ఒక స్పూన్ నువ్వులు కలిపి ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గంట ముందు తాగాలి. ఈ విధంగా తాగటం వలన శరీరంలో క్యాలరీలు త్వరగా ఖర్చు అవుతాయి. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగి ఎంత లావుగా ఉన్న వారైనా సన్నగా మారతారు. శరీరంలో వ్యర్ధాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
red capsicum
అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అలసట,నీరసం లేకుండా చురుకుగా ఉంటారు. చాలా మంది అధిక బరువు సమస్యను తగ్గించుకోవటానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా సహజసిద్దంగా తయారుచేసుకున్న ఈ జ్యూస్ తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.