Healthhealth tips in telugu

ఈ టీ 15 రోజులు తాగితే Joint Pains,వెన్నునొప్పి,అధిక బరువు అన్ని మాయం అవుతాయి

joint pains home remedies in telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మందులను ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలా కాకుండా సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ప్రయోజనం కలుగుతుంది. .
ajwain seeds and kidney stones
సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఇంటి చిట్కాలను ఫాలో అవుతూ డాక్టర్ను తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ సూచనలు కూడా తప్పని సరిగా పాటించాలి.ఈ రోజుల్లో వచ్చే కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, కొలెస్ట్రాల్, యూరిక్ యాసిడ్,అధిక బరువు వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఈ చిట్కా కోసం కేవలం రెండే రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.

వాము, కలోంజీ విత్తనాలు… ఈ రెండింటిని ఈ చిట్కా కోసం ఉపయోగిస్తున్నారు. ఒక గ్లాస్ నీటిలో పావు స్పూన్ వాము,పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన వాము కలోంజి విత్తనాలు తింటూ ఆ నీటిని తాగాలి.మరో విధంగా కూడా వీటిని తీసుకోవచ్చు.
Joint Pains
ఒక గ్లాసు నీటిని పొయ్యి మీద పెట్టి పావు స్పూను వాము, పావు స్పూన్ కలోంజీ విత్తనాలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి వడగట్టి ఆ నీటిని తాగాలి. ఈ నీటిలో తేనె కూడా కలుపుకోవచ్చు అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Weight Loss tips in telugu
వాము,కలోంజీ విత్తనాలు రెండూ కూడా మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ డ్రింక్ ని తయారుచేసుకొని తాగితే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అధిక బరువు వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోతాయి. కలోంజీ విత్తనాలు ఆయుర్వేదం షాప్ లలోనూ, online stores లో లభ్యం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.