Healthhealth tips in telugu

కేవలం పావు స్పూన్ పొడి అధిక బరువు,డయాబెటిస్ ఉన్నవారికి దివ్య ఔషధం…జీవితంలో అసలు ఉండవు

cumin seeds to control blood sugar levels In Telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా చిన్న వయసులోనే షుగర్ బారిన పడుతున్నారు. షుగర్ అంటే డయాబెటిస్. డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడాల్సిందే. మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలు తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో ఆహారం కీలక పాత్రను పోషిస్తుంది.
cumin seeds
డయాబెటిస్ అనేది అధిక బరువు, సరైన జీవనశైలి లేకపోవడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇప్పుడు చెప్పే పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే డయాబెటిస్ తో పాటు అధిక బరువు తగ్గటానికి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటానికి సహాయపడుతుంది.
cumin seeds diabetes
జీలకర్రను డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ జీలకర్ర పొడి కలిపి ఉదయం పరగడుపున తాగాలి…లేదంటే ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడిని కలిపి తీసుకోవచ్చు…లేదంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ పొడిని జల్లి తినవచ్చు.
Diabetes diet in telugu
ఈ పొడిని ఎలా తీసుకున్న డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. జీలకర్ర శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. జీలకర్రలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
Weight Loss tips in telugu
అందువల్ల డయాబెటిస్ నిర్వహణలో సహాయపడటమే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజు పావు స్పూన్ మోతాదులో జీలకర్ర పొడిని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యల పరిష్కారానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.