Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Piles control fruits in telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. మలద్వారం లోపల వాహిక గోడపైన స్వల్పంగా వాపు ఏర్పడడాన్ని పైల్స్ అంటారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి.
piles home remedies
పైల్స్ కు ప్రధాన కారణం జీర్ణవ్యవస్థ. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక, బయటకు విసర్జింపబడక ఇబ్బందులు పడవలసి వస్తుంది. పైల్స్ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో ప్రతిసారి నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి వచ్చినట్లుగా ఉంటుంది. ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి.
Piles Fruits
ఈ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. నీరు ఎక్కువగా తాగాలి. గంటల తరబడి ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో లేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. కాస్త ఓపికగా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
Fig Fruit Benefits in telugu
అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. పైల్స్‌తో బాధపడేవారు రెండు అంజీర్ లను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తింటే పైల్స్ వాపు మరియు నొప్పి తగ్గుతాయి. జీర్ణ సంబంధ సమస్య కూడా తొలగిపోతుంది.
pineapple
అనాస పండులో కరిగే మరియు కరగని ఫైబర్‌లు ఉంటాయి. రెండూ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇది కడుపు మరియు ప్రేగుల ద్వారా ఆహారం మరింత సులభంగా వెళ్ళడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అనాస జ్యూస్ కాకుండా అనాస పండు ముక్కలను తినాలి.
Immunity Foods
విటమిన్ సి సమృద్దిగా ఉన్న నిమ్మ, నారింజ మరియు ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. టమోటాలు వంటి సిట్రస్ పండ్లలో నారింగెనిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నీటిశాతం కూడా బాగా ఉండడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొంది మలాన్ని మృదువుగా చేస్తుంది. దాంతో పైల్స్ సమస్య తగ్గుతుంది.
apple
ఒక యాపిల్‌లో దాదాపు 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్‌లో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణవ్యవస్థలో జెల్ లాంటి అనుగుణ్యతను సృష్టిస్తుంది. ఇది మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. దీంతో మలం సులభంగా వెళ్లేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల పైల్స్ సమస్యను దూరం చేసుకోవచ్చు.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దానిమ్మ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీని కలిగి ఉంటుంది. ఇది పైల్స్ వల్ల కలిగే మంటను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, దానిమ్మలో మంచి మొత్తంలో నీరు ఉంటుంది, ఇది శరీరం డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. దానిమ్మ గింజలను తినాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.